Bheemla Nayak OTT: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ సాగుతోంది.
కొంతమంది ఫ్యాన్స్ టికెట్లకోసం నానా ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొందరేమో బ్యాక్ టూ బ్యాక్ షోలు చూస్తున్నారు. ఫ్యాన్స్‌తో పాటు క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు మంచి మార్కులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. థియేటర్లు నిండిపోతున్నాయి. రీమేక్ మూవీ అయినప్పటికీ.. అంచనాలకు మించి సినిమా ఉన్నట్లు అభిమానులు చెబుతున్నారు.
థియేటర్లలో భీమ్లా నాయక్ సందడి నడుస్తుండగానే.. మరోవైపు ఓటీటీలోఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయంపై చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో భీమ్లానాయక్ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
ఎందులో రానుంది?
ఆహా ఓటీటీ తెలుగు రైట్స్‌ను అహా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం మార్చి చివరి వారంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయొచ్చని సమాచారం. ఇక భీమ్లా నాయక్ డబ్బింగ్ వెర్షన్‌ను 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది.
తెలుగు ఒరిజినల్‌తో పాటు.. హీందీ డబ్బింగ్ వెర్షన్‌కు భారీ ధర చెల్లించినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేవలం ఓటీటీలు, శాటిలైట్స్ ద్వారానే రూ.70 లాభాన్ని గడిస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఇక థియేటర్లలో భీమ్లా నాయక్ కలెక్షన్స్ కలెక్షన్ల వర్షం కురిపించనున్నట్లు థియేటర్ల వద్ద సందడి చూస్తే అర్థమవుతోంది. మొత్తం మీద భీమ్లా నాయక్ మూవీ నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read: Bheemla Nayak Review: భీమ్లా నాయక్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
Also read: Bheemla Nayak Movie: మొదలైన 'భీమ్లా నాయక్' సందడి.. థియేటర్ల వద్ద పవన్ ఫాన్స్ హంగామా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook