Bheemla Nayak Pre Release Event: పవన్ కల్యాణ్ స్పీచ్‌పై రాంగోపాల్ వర్మ కామెంట్స్
Bheemla Nayak Pre Release Event: `భీమ్లా నాయక్` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ స్పీచ్ పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రసంగం చాలా బాగుందని.. ఆయన చాలా హుందాగా, మర్యాదగా ప్రవర్తించారని ఆర్జీవీ కొనియాడారు. పవన్ స్పీచులలో కెల్లా తనకు `భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ నచ్చిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Bheemla Nayak Pre Release Event: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 25)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ 'భీమ్లా నాయక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా అని చెప్పారు. అయితే పవన్ స్పీచ్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
"భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చాలా హుందాగా ఉన్నారు. ఎంతో అద్భుతంగా మాట్లాడారు. ఆయన ప్రవర్తన, వ్యవహరించిన తీరు ఎంతో మర్యాదపూర్వకంగా ఉంది. అందుకే పవన్ కల్యాణ్ ను పవర్ ఫుల్ అనేది" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ఆ తర్వాత 'భీమ్లా నాయక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ మాట్లాడిన స్పీచ్ వీడియోను ట్వీట్ చేస్తూ.. పవన్ కల్యాణ్ పై మరో కామెంట్ చేశారు. "ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ప్రసంగాల్లో ఇది ఉత్తమమైనది. ఇందులో ఆయన ప్రసంగం భావోద్వేగంగా, హృదయపూర్వకంగా, వినయంగా ఉంది" అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు తెలుగు రీమేక్ 'భీమ్లా నాయక్'. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి సరసన నిత్యా మేనన్, సంయుక్త మేనన్ నటించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: Bheemla Nayak Release Trailer: భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్.. గూస్ బంప్స్ అంతే..