Bheemla Nayak Release Trailer: భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్.. గూస్ బంప్స్ అంతే..
Pawan Kalyan Bheemla Nayak Release Trailer: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్, మసాలా, అదిరిపోయే బీజీఎంతో కట్ చేసిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.
Pawan Kalyan Bheemla Nayak Release Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' రిలీజ్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం యూట్యూబ్‌లో విడుదలైంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అలా విడుదల చేశారో లేదో.. ఈ ట్రైలర్‌కు ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇదివరకు విడుదల చేసిన ట్రైలర్‌కే మరికొన్ని సన్నివేశాలు.. బీజీఎం జోడించి ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో పవన్-రానా ఎదురుపడే సన్నివేశాలు గూస్ బంప్స్ రేకెత్తించేలా ఉన్నాయి.
పవన్ తన చేతిలో గొడ్డలి పట్టుకుని విలన్స్‌ని మట్టుబెట్టే సీన్స్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రానా ఎంట్రీ.. పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఎదరుపడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 'ఏయ్ రామస్వామి.. రాయవయ్యా ఎఫ్ఐఆర్.. ఈడు బలిసికొట్టుకుంటున్నాడు.. మనమేంటో చూపిద్దాం..' అంటూ పవన్ చెప్పే డైలాగ్ అభిమానులను కట్టిపడేస్తోంది. ఇక నిత్యా మీనన్ చెప్పిన.. 'నాయక్ పెళ్లామంటే నాయక్‌లో సగం కాదు.. డబుల్..' అనే డైలాగ్ కూడా బాగా హైలైట్ అయింది.
రెండు రోజుల క్రితం విడుదల చేసిన 'భీమ్లా నాయక్' ట్రైలర్ కన్నా రిలీజ్ ట్రైలర్‌లో బీజీఎం అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కదా ట్రైలర్ అంటూ అభిప్రాయపడుతున్నారు. రిలీజ్ ట్రైలర్ విడుదల చేసి మంచి పని చేశారని.. దీంతో సినిమాపై హైప్ పెరిగిందని అంటున్నారు. విడుదలైన కాసేపటికే ఈ ట్రైలర్ 1 మిలియన్ మార్క్‌కి చేరువగా వెళ్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. నిజానికి గత నెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడక తప్పలేదు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు.
Also read : Bheemla Nayak Trailer: సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ మాస్ జాతర.. ట్రైలర్ కు వన్ మిలియన్ లైక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook