Bheemla Nayak Song Update: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో అప్డేట్.. ‘అడవి తల్లి మాట’ సాంగ్ రిలీజ్ ఫిక్స్
Bheemla Nayak Song Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ వచ్చింది. రెండు రోజుల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ‘అడవి తల్లి పాట’ పాట అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడా పాటను డిసెంబరు 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Bheemla Nayak Song Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరును పెంచేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘భీమ్లా నాయక్’ టీజర్.. టైటిల్ సాంగ్ తో పాటు ‘లాలా భీమ్లా‘ పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన ‘లాలా.. భీమ్లా‘ సాంగ్ కు పవన్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ లభిస్తోంది.
ఈ సినిమాలోని మరో సాంగ్ ‘అడవి తల్లి పాట’ ను డిసెంబరు 1వ తేదీన విడుదల చేయాల్సింది. అయితే పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట విడుదల ఆపేసింది. దీంతో ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబరు 4న (శనివారం) ఉదయం 10.08 గంటలకు ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన సారాంశం ఈ పాటలో ఉంటుందని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయతగా పనిచేస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు తెలుగు రీమేక్ గా ‘భీమ్లా నాయక్’ తెరకెక్కుతోంది. మలయాళ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా బిజూ మేనన్ నటించగా.. ఆ పాత్రలో పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడు. మరో కీలక పాత్ర పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. వీరితో పాటు పవన్ సరసన నిత్యా మేనన్.. రానా పక్కన సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read: Akhanda : బాలకృష్ణ తన రికార్డులను తానే బద్దలు కొడ్తాడు.. అఖండపై నందమూరి రామకృష్ణ ప్రశంసలు
ALso Read: Movie ticket prices : సినిమా టికెట్ల రేట్లను తగ్గించం..ఒమిక్రాన్‌ను ఎదుర్కొంటాం : మంత్రి తలసాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook