Bheemla nayak trailer: భీమ్లా నాయక్ టీమ్ ఎట్టకేలకు ట్రైలర్​పై అప్​డేట్ ఇచ్చింది. సోమవారం భీమ్లా నాయక్ ట్రైలర్​ విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్​టైన్మెంట్స్​ ఇవాళ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భీమ్లా నాయక్ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది చిత్ర యూనిట్. సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పటికీ.. ట్రైలర్​ గురించి అప్​డేట్ మాత్రం రాలేదు. దీనితో ఫ్యాన్స్ చిత్ర యూనిట్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


నిన్న సినిమా టికెట్స్ బుకింగ్స్ గురించి కూడా చిత్ర నిర్మాత అప్​డేట్ ఇచ్చారు. అయినా ట్రైలర్​ విడుదల చేయకపోవడంతో పవన్ కల్యాణ్​ ఫ్యాన్స్​..నిర్మాణను బండ బూతులు తిట్టారు. దీనితో చిత్ర యూనిట్​ ట్రైలర్​పై అప్​డేట్ ఇచ్చింది. రేపే సినిమా ట్రైలర్​ విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.


మరోవైపు సోమవారమే.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్​ ముక్య అతిథిగా హాజరు కానున్నారు.



భిమ్లానాయక్ సినమాలో పవన్​ కల్యాణ్​, రానాలు ప్రధాన పాత్రలు పోషించారు. నిత్యామీనన్​, సంయుక్త మీనన్​లు హీరోయిన్లు.


ఈ మూవీ మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్​ కోషియంకు రీమేక్​. ఒరిజినల్​లో పృథ్విరాజ్, బిజు మీనన్​లు ప్రధాన పాత్రలు పోషించారు. 2020లో విడుదలైన ఈ సినిమా సూపర్​ హిట్ అయ్యింది.


Also read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై అనన్య పాండే సంచలన కామెంట్స్..


Also read: Bheemla Nayak Updates: భీమ్లా నాయక్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న డైరెక్టర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook