Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై అనన్య పాండే సంచలన కామెంట్స్..

Ananya Pande on Vijay Devarakonda: ఆన్‌స్క్రీన్ అయినా, సినిమా ఈవెంట్లలో అయినా విజయ్ దేవరకొండ ఎంత డేరింగ్ యాటిట్యూడ్‌తో కనిపిస్తాడో అందరికీ తెలిసిందే. అలాంటి విజయ్ దేవరకొండను పిరికివాడంటూ 'లైగర్' హీరోయిన్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 12:43 PM IST
  • హీరో విజయ్ దేవరకొండపై హీరోయిన్ అనన్య పాండే సంచలన కామెంట్స్
  • విజయ్ పిరికివాడంటూ కామెంట్ చేసిన అనన్య
  • అదే సమయంలో విజయ్ బెస్ట్ కో స్టార్ అని ప్రశంసలు
 Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై అనన్య పాండే సంచలన కామెంట్స్..

Ananya Pande on Vijay Devarakonda: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండపై 'లైగర్' హీరోయిన్ అనన్య పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ సహజంగా ఒక పిరికివాడని కామెంట్ చేసింది. ఆన్‌స్క్రీన్ విజయ దేవరకొండ వేరు అని.. బయట విజయ్ దేవరకొండ వేరు అని పేర్కొంది. సినిమాల్లో కనిపించేదానికి పూర్తి భిన్నంగా విజయ్ బయట ఉంటాడని అభిప్రాయపడింది. అదే సమయంలో విజయ్ బెస్ట్ కో స్టార్ అంటూ పొగడ్తలు కురిపించింది. అయితే అనన్య ఈ కామెంట్స్ ఎప్పుడు ఎక్కడ చేసిందనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం అనన్య కామెంట్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా విజయ్ దేవరకొండను చూస్తే యాటిట్యూడ్ కా బాప్ అనేలా ఉంటాడు. స్టేజీ పైకి ఎక్కాడంటే తన స్పీచులతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ డేరింగ్ యాటిట్యూడ్ ఎంతమందిని ఫిదా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి విజయ్ దేవరకొండను పిరికివాడంటూ అనన్య పాండే కామెంట్స్ చేయడం విజయ్ ఫ్యాన్స్‌లో చర్చకు దారితీసింది. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ అనన్య పాండేతో కలిసి 'లైగర్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా 'మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్' నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే విడుదలైన లైగర్ టీజర్ అభిమానులను ఉర్రూతలూగించింది. టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో విజయ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Wriddhiman Saha: రాహుల్‌ ద్రవిడ్‌, దాదాలపై సాహా సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News