Bhola Shankar update : Mega Star Chiranjeevi's SWAG of BHOLAA released : మెగా ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ సందర్భంగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. చిరు ప్రస్తుతం చాలా మూవీలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న భోళా శంకర్ మూవీలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్‌ అయ్యే చిరు మూవీల్లో ఇది ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ మెయిన్ షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూ ఇయర్ సందర్భంగా స్వాగ్ ఆఫ్ భోళా అంటూ భోళా శంకర్ మూవీ యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. భోళా శంకర్ అంటూ సాగే మ్యూజిక్‌తో పాటు చిరు పోస్టర్‌‌తో ఉండే ప్రోమో రిలీజైంది. ఈ మాస్ సాంగ్ ప్రోమోలో మెగాస్టార్ లుక్ ఆకట్టుకుంటుంది. పోస్టర్‌‌లో మెగాస్టార్ తన ఫేస్‌ను చేతితో కవర్ చేసుకుంటూ ఉండే స్టిల్‌ ఉంటుంది. చిరు చేతికి పవిత్రమైన దారాలు ఉంటాయి.. ఈ మూవీలో చిరు భోళాగా కనిపించబోతున్నాడు. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన స్వాగ్ ఆఫ్ భోళా శంకర్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో జోష్‌ను పెంచింది.



 


Also Read : Vaccination of children: పిల్లల టీకాకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం- స్లాట్ ఎలా బుక్​ చే


ఇక ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ కూడా అదిరిపోయింది. మహతి స్వర సాగర్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భోళా శంకర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరుకు సోదరిగా కనిపించనుంది.




Also Read : Corona cases in India: ఒక్క రోజులో 22,700 కరోనా కేసులు, 406 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook