Bhoothadam Bhaskar Narayana: వైవిధ్యమైన మైథలాజికల్ థ్రిల్లర్.. దిష్టిబొమ్మ గురించి తెలియని విషయాలు బయటపెట్టబోతున్న సినిమా
Shiva Kandukuri: పెళ్లిచూపులు లాంటి అద్భుతమైన సినిమా మనకు అందించిన నిర్మాత రాజ్ కందుకూరి. ఆయన కొడుకు శివ కందుకూరి కూడా తండ్రి బాటనే ఫాలో అవుతూ.. గమనం లాంటి మంచి సినిమాలలో నటించాడు. ఇప్పుడు ఈ హీరో మన ముందుకి భూతద్దం భాస్కర్ నారాయణ అనే సరికొత్త థ్రిల్లర్ తో రాబోతున్నారు..
Bhoothadam Bhaskar Narayana
మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించి ఎంతో పేరు సంపాదించుకున్న రాజ్ కందుకూరి కొరకు శివకందుకూరి హీరోగా చేస్తున్న వైవిద్యమైన థ్రిల్లర్ భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమా టీజర్ విడుదలైన దగ్గరనుంచి ఈ చిత్రంపై అంచనాలు ప్రేక్షకులలో భారీగా ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా ఇంస్టాగ్రామ్ లో సరికొత్త విధానంలో జరుగుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమా మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శివ కందుకూరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు..
డిటెక్టివ్, థ్రిల్లర్ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. అలాంటి జోనర్లో సినిమా తీయాలి అన్నప్పుడు తప్పకుండా యునిక్ నెస్ వుంటే తప్పితే చేయకూడదని అనుకున్నాను. ఇలాంటి సినిమాలో భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నాను. ఇందులో ఒక మైథాలజీ ఎలిమెంట్ వుంది. మీరు ఇంతకుముందు ఈ సినిమాలో మేం డిస్కస్ చేసే పాయింట్ గురించి ఎక్కడ చూసి ఉండరు. మామూలుగా మనము దిష్టి బొమ్మ చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు వుందనేది పెద్దగా పట్టించుకోము. దాని గురించి చాలా మందికి తెలీదు. దిని గురించి పురాణాల్లో ఒక పెద్ద కథ వుంది. దానిని ఈ కథకు చాలా అద్భుతంగా జోడించాడు దర్శకుడు. మీకు సినిమా చూసినంత సేపు చాలా కొత్తగా ఉంటుంది. అలాగే ఇందులో డిటెక్టివ్ పాత్ర కూడా దర్శకుడు చాలా అభిన్నంగా డిజైన్ చేశారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిటింగా అనిపించిందో సినిమా చూసినప్పుడు అది మరింతగా పెరిగింది. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయం గురించి చెబుతూ..’ఇందులో నా పేరు భాస్కర్ నారాయణ. అయితే నా పాత్రకు భూతద్ధం సైజు కళ్ళద్దాలు వుంటాయి. అందుకే నన్ను అందరూ భూతద్ధం భాస్కర్ నారాయణ అని పిలుస్తుంటారు. డిటెక్టివ్ అనేసరికి భూతద్ధంని వాడుతుంటాం. టైటిల్ కి పాత్రకు రెండికి ఆ టైటిల్ యాప్ట్ గా సరిపోయింది అని మాకనిపించింది. ఇందులో ఫన్ ఎలిమెంట్ కూడా వుంది. అయితే కథలో భాగమైయ్యే వుంటుంది. అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా కథలో లీనమయ్యే వస్తుంది’ అని తెలియజేశారు.
ఇక హీరో చెప్పిన ఈ విశేషాలు విని ప్రేక్షకులలో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఈ హీరోకి ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి అంటే రేపటి వరకు వేచి చూడాలి.
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter