LPG Gas Cylinder: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

Telangana Government Schemes: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 28, 2024, 10:45 AM IST
LPG Gas Cylinder: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్..  అర్హులు మాత్రం వీళ్లే..

Mahalakshmi Scheme Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు. అదేవిధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. 

ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలె అభయహస్తంలో భాగంగా దరఖాస్తు పారమ్ తీసుకున్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌,  ఈ రోజు  పథకానికి సంబంధించిన జీవో జారీ చేశారు..కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ పథకాలను అమల్లోకి తీసుకువస్తుంది. ఈ పథకంలో భాగంగా మహిళలకు రూ.500 గ్యాస్ సిలిండర్ ను అందించనుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి అర్హులేవరంటే..?

ఇదీ చదవండి: రూ. 500 ధరకే గ్యాస్ సిలిండర్.. మొదట కంప్లీట్ అమౌంట్ ను చెల్లించాల్సిందే.. డిటెయిల్స్ మీకోసం..

1. ప్రజాపాలనలో రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకానికి దరఖాస్తు చేసుకుని ఉండాలి.
2. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొంది ఉండాలి.
3. ముఖ్యంగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్నవారికే పథకం వర్తిస్తుంది. 
4. గ్యాస్ సిలిండర్ గత వినియోగం కూడా పరిగణలోకి తీసుకోకున్నారు.

ఇదీ చదవండి: నేడు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్..

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ రూ.955 గా ఉంది.  తెలంగాణలో కొన్నిచోట్ల సిలిండర్ ధరల్లో స్వల్పమైన మార్పులుండవచ్చు. ట్రాన్స్ పోర్టు ధరల్లో హెచ్చు, తగ్గుల వల్ల ఈ ధరలలో వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. రూ.500 గ్యాస్ కాకుండా మిగతా డబ్బు సిలిండర్ డెలివరీ తీసుకున్న 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమా చేస్తున్నట్లు ప్రకటించారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News