Actress Bhumika Chawla wedding anniversary: ఖుషి, ఒక్కడు, సింహాద్రి, వాసు, మిస్సమ్మ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన భూమిక చావ్లా అంటే టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు.  ఐతే భూమిక తన భర్తతో విడిపోయిందని ( Bhumika Chawla divorce ) కొంత కాలంగా పుకార్లు వ్యాపించాయి. ఈ మధ్య కాలంలో వాళ్లు పబ్లిక్‌లోకి వచ్చినపుడు భూమిక భర్త ఆమెకి దూరంగా ఉంటున్నాడని.. అలాగే, భూమిక కూడా చాలా కాలంగా తన సోషల్ మీడియా పోస్ట్‌లలో తన భర్త గురించి ప్రస్తావించడం లేదని ఏవేవో టాక్స్ వినిపించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజు భూమిక మ్యారేజ్ డే ( Bhumika Chawla marriage day) సందర్బంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, తన భర్తకి మ్యారేజ్ డే విషెస్ చెప్పి అన్ని పుకార్లకు చెక్ పెట్టింది. ఈ సందర్భంగా భూమిక తన ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. " వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని.. ఆ ఒక్క అడుగు ప్రేమేనని... ప్రేమ అంటే ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం.. మనల్ని, మన జంటను ఆ దేవుడు ఆశీర్వదించాలి. హప్పీ యానివర్సరీ" అని రాసుకొచ్చింది. ఈ సందర్భంగా భర్తకు కృతజ్ఞతలు చెప్పిన భూమిక.. కష్టపడే నీ మనస్తత్వాన్ని చూసి గర్వంగా ఉందని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. 

భూమిక తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు  2007 లో యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను ( Bhumika Chawla's husband Bharath Thakur ) వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లి తరువాత భూమిక టాలీవుడ్‌లో సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసింది, కాని వరుసగా ఫ్లాప్‌‌లు రావడంతో తర్వాత సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఆపేసింది. ఆ తరువాత భూమిక కుటుంబం హైదరాబాద్ నుండి ముంబైకి షిఫ్ట్ అయ్యారు.


రెండేళ్ల క్రితం హీరో నాని నటించిన ‘ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంతో ( MCA movie ) భూమిక టాలీవుడ్‌లోకి తిరిగి అడుగుపెట్టింది. ఆ తరువాత ‘యు-టర్న్’, ‘సవ్యసాచి’, ‘రూలర్’ వంటి చిత్రాల్లో నటించింది. భూమిక నెక్స్ట్ ‘సీటిమార్’ ( Seetimaarr ) సినిమాలో కనిపించనుంది.


భూమిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే... ఆ ఇద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భూమిక పోస్ట్ చూశాకానైనా.. భూమిక విడాకులు తీసుకుంటోందనే పుకార్లకు చెక్ పడుతుందని ఆశిద్దాం.