Breaking news: టాలీవు డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ కు క్లీన్ చిట్...
సంచలనం శృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ కు క్లీన్ చిట్ లభించింది. వీరిద్దరి నమునాలలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎల్ వెల్లడించింది
Tollywood Drug Case Big Update: నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood Drugs Case) మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఈడీ మళ్లీ డ్రగ్స్ కేసులో ఉన్నవారిని విచారించనున్న సంగతి మనకు తెలిసిందే..
ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుబాటి, హీరో రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్ విచారించిన ఈడీ (Enforcement Directorate) మిగిలిన వారిపై కూడా విచారణ కొనసాగిస్తుంది.
తాజాగా అందిన వార్తా ప్రకారం, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఫోరెన్సిక్ లేబరేటరి లిమిటెడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్‌లకు క్లీన్ చిట్ ఇచ్చిందని తెలుస్తుంది.
Also Read: Heart Wrenching Video:హెల్మెట్ లేకపోతే ఇతడి తల పుచ్చకాయలా పేలిపోయేది..! (వీడియో)
2017లో 2017 లో ఎక్సైజ్ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు సెలబ్రిటీల నుంచి బ్లడ్ , హెయిర్ , గోళ్ళ నమూనాలను ఎఎఫ్‌ఎల్ సేకరించిన విషయం మనకు తెలిసిందే... అయితే దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్‌ల బ్లడ్, హెయిర్ , గోళ్ళ నమూనాలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎల్ వెల్లడించింది.
2017లో టాలీవుడ్ సంచలనం రేపిన డ్రగ్స్ కేసు...
హైదరాబద్ జులై 2 2017 లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ మరియు అబ్దుల్ వహీద్, ఖుద్దూస్‌లను క్సైజ్ అధికారులు అరెస్ట్ చేసారు. రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనంతో పాటు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు విద్యార్థులు, సినీ ప్రముఖులకు డ్రగ్స్ విక్రయించినట్లు అనుమానించారు. విచారణలో ప్రముఖుల సినీ నటుల పేర్లు వెల్లడించటం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
Also Read: Breaking News: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరిందర్ సింగ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Drugs Case) కోసం ప్రత్యేక బృందం సిట్ (Special Investigation Team) ఏర్పడి, ఈ కేసులో 12 కేసులను నమోదు చేసి, 11 చార్జీషీట్లను కోర్టులో దర్యాప్తు అధికారులు దాఖలు చేసింది. మాదక ద్రవ్యాలు తీసుకునే వారి జుట్టు, గోళ్ల లో డ్రగ్స్ నమునాలు చాలా కాలం పాటు ఉంటాయని భావించి టాలీవుడ్ ప్రముఖులతో (Tollywood Celebrities) సహా మొత్తం 62 మంది దగ్గరి నుండి నమూనాలను సేకరించి పరీక్షలు జరిపింది. కానీ ఇప్పటి వరకు ఈ వైద్య పరీక్షల ఫలితాలను బయటకి వెల్లడించక పోవటం గమనార్హం. అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. అప్పట్లో సిట్ విచారణకు హాజరైన ప్రముఖులను మళ్లి విచారించాలని నిర్ణయించుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook