మనలో చాలా మంది... అంతెందుకు మనమే, మన కుటుంబీకులే హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ ఉంటారు, కానీ ఈ వీడియో చూసాక మాత్రం మీకు మీరుగా హెల్మెట్ లేకుండా బైక్ నడపోద్దని ఫిక్స్ అయిపోతారు. రోడ్డు ప్రమాదాల్లో చావును దగ్గరగా చూసి వచ్చిన వ్యక్తికి మాత్రమే హెల్మెట్ విలువ తెలుస్తుంది. ఊరికే ఎవరు వినరు.. అంతెందుకు.. హెల్మెట్ ధరించమని చెప్తే నేనే వినను. ఈ వీడియో చూసాక పూర్తిగా నా ఆలోచనే మారిపోయింది. మీ ఆలోచన కూడా తప్పక మారుతుంది.
మన దేశంలో ఉన్న ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, బైక్ ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరి. హెల్మెట్ లేని ప్రయాణానికి గానూ మన ట్రాఫిక్ పోలీసులు ఫైన్ కూడా వేస్తాయి. కానీ కొంత మందికి వీటి పట్ల ఎలాంటి పట్టింపులు లేవు మరియు ప్రాణాలంటే లెక్కలేదు.
Also Read: Viral Photo: ఆన్‌లైన్ క్లాస్‌లో అందరిని ఫూల్ చేసిన అమ్మాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ఒకటి కాదు.. మూడు ప్రాణాలను కాపాడిన హెల్మెట్
మనలో చాలా మంది ఎక్కువగా ఉన్న భయం ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే ఎక్కడ హెల్మెట్ లేదని వంకతో ఫైన్ కట్టాల్సి వస్తుందేమో అని.. కానీ హెల్మెట్ వాడకపోతే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతాయన్న భయం చాలా మందికి తక్కువే. ఇలాంటి ఆలోచన మార్చటానికి మీకోసం ఒక వైరల్ వీడియో తీసుకొచ్చాను.
ఈ వీడియోలో ఒక వ్యక్తి తన భార్యా- పిల్లలను బైక్ పైన ఎక్కించుకొని వెళ్తున్నాడు.. అదే సమయంలో ఒక ట్రాక్టర్ ఎదురుగా వస్తుంది. వర్షాకాలం కదండీ... రోడ్డంతా నీటితో నిండిపోయి ఉంది.. ఈ కారణంగా రోడ్డుపై ఉన్న గుంటలు, రాళ్లు ఏమి కనపడవు.
Also Read: IPL 2021: రేపటి నండే ఐపీఎల్ రెండోదశ... ఎంటర్టైన్మెంట్ షురు!
ఒక్క పొరపాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది
యదావిధిగా అతడు బైక్ పైన వెళ్తున్నాడు. ఏం జడిగిందో ఎవరికీ తెలియదు.. తెలిసే లోపే ఓ పెద్ద ప్రమాదం నుండి భయటపడ్డాడు.... చుస్తుండానే బైక్ కింద పడటం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వెనుక టైర్ కింద అతని తల పడటం.. అది గమనించని ట్రాక్టర్ డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లటం. ఒకవేళ అతడి తలకి కనుక హెల్మెట్ లేకపోతే... అతడి తల పుచ్చకాయలా పగిలిపోయేది. తన భార్య చూస్తుండగానే దారుణం జరిగిపోయేది.
కింద పడ్డ వెంటనే భార్య తన పిల్లాడితో వెనుకకు జరిగి ప్రాణాలు కాపాడుకుంది. అదే సమయంలో భర్తను వెనక్కి లాగి కాపాడలేని పరిస్థితి... ఆ ఒక్క నిమిషం ఆ మహిళ ఎంత బాధను అనుభవించి ఉంటుందో.. ఎంత భయానికి లోనై ఉంటుందో.. ?? అదే పరిస్థితి మనకే వస్తే.. ఆ సమయంలో హెల్మెట్ లేకపోతే...??
#Helmet saves life...
#ट्रैक्टर का पूरा #पहिया सर के उपर से होकर गुज़र गया लेकिन #बाइकचालक को कुछ नहीं हुआ ।👌 pic.twitter.com/TIG3wtgV6P
— Rupin Sharma IPS (@rupin1992) September 18, 2021
ఈ వీడియోను IPS ఆఫీసర్ రూపిన్ శర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దీనికి కాప్షన్ గా "హెల్మెట్ సేవ్స్ లైఫ్" అని టాగ్ కూడా తగిలించారు.
Also Read: Narendra Modi: ఉగ్రవాదం పెరగడానికి ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలే కారణం, ఎస్‌సీవో సదస్సులో మోదీ
కావున అందరు బైక్ ప్రయాణం చేసేపుడు హెల్మెట్ వాడటం మరవకండి.. మీరు చేసే చిన్న తప్పుకు మీరే కాదు మీపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు పరిస్థితి ఆలోచించండి. హెల్మెట్ మీ ప్రాణాలనే కాదు, మీ కుటుంబ సభ్యుల భష్యత్తును చెల్లా చెదురు అవకుండా కాపాడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి