Bigg Boss 4 Telugu contestant Amma Rajasekhar: బిగ్ బాస్ హౌజ్‌లో 6వ వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ అనగానే ప్రేక్షకులు మరింత ఎంటర్టెయిన్మెంట్ కోసం ఎదురుచూస్తుంటారు. బిగ్ బాస్ 4 తెలుగు ( Bigg Boss 4 Telugu ) రియాలిటీ షోలో భాగంగా గత వారం జరిగిన డీల్ ఆర్ నో డీల్ టాస్క్‌లో ఇంటి సభ్యులు రెండు టీంలుగా విడిపోయి టాస్క్‌లు చేసిన సంగతి తెలిసిందే.. అందులో బ్లూ టీం ఒక డీల్‌ని ముగించలేదు. ఆ డీల్‌కి సంబంధించి నాగార్జున ( Bigg Boss host Nagarjuna Akkineni ) హౌజ్‌మెట్స్‌కి ఒక పెద్ద ఆఫర్ ప్రకటించాడు. ఆ డీల్‌ని యాక్సెప్ట్ చేసిన వారికి తదుపరి నామినేషన్స్‌లో మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపాడు. ఆ డీల్ మరేంటో కాదు 'సగం గుండు, సగం గడ్డం' ( Half beard ).. ఆ టాస్క్ జరిగిన రోజు అమ్మ రాజశేఖర్ ( Amma Rajasekhar ) ఆ డీల్ చేస్తానని ముందుకు వచ్చి చేయలేదు. Also read : Bigg Boss: గోళ్ల‌తో ర‌క్కిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. కంటెస్టంట్ క‌ళ్ల‌కు గాయాలు



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు అదే టాస్క్‌ని బ్లూ టీంలో ఉన్న అబ్బాయిలలో ఎవరైన చేయొచ్చని నాగర్జున తెలిపారు. బ్లూ టీంలో ఉన్న అబ్బాయిలు అమ్మ రాజశేఖర్, అఖిల్, కుమార్ సాయి, నోయల్ కాగా ప్రస్తుతం హౌజ్‌లో కెప్టెన్‌గా కొనసాగుతున్నందున సింగర్ నోయల్ ( BB4 Telugu contestant Noel Sean ) ఈ టాస్క్ ఆడటానికి అర్హుడు కాదని చెప్పారు. అప్పుడు మిగిలింది ముగ్గురు మాత్రమే.. అందులో అమ్మ రాజశేఖర్ ముందుకు వచ్చి నేను చేస్తాను అని టాస్క్ తీసుకున్నాడు.



అమ్మ రాజశేఖర్‌కి జుట్టు అంటే బాగా ఇష్టం అయినా కూడా ఎందుకు చేయించుకుంటున్నావ్ అని మరో కంటెస్టంట్ నటి దివి ( Bigg Boss 4 Telugu contestant Divi breaks down ) కన్నీళ్ళు పెట్టుకుంది. ఇంటి సభ్యులు అందరూ మాస్టర్ ఒకసారి ఆలోచించండి అని వారించారు. నాగార్జున మరోసారి యస్ ఆర్ నో అని అడగగా ఇష్టం లేకపోయినా ఏడ్చుకుంటూ యస్ అని చెప్పాడు. అప్పుడు నాగార్జున ఆదేశం మేరకు నోయల్.. రాజశేఖర్ మాస్టర్ జుట్టును సగం గుండుగా ట్రిమ్ చేశాడు. అలా ఆ టాస్క్ పూర్తి చేసి అమ్మ రాజశేఖర్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఆ తరువాత అమ్మ రాజశేఖర్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. 'మీ అమ్మ గురించి కూడా చెయ్యని త్యాగాన్ని ఇప్పుడు చేశారు' అని అమ్మ రాజశేఖర్‌ని పొగిడారు. Also read : Jordar Sujatha about BB4 Telugu: అది నా తప్పు కాదు.. బిగ్ బాస్ నిర్ణయం: జోర్దార్ సుజాత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe