Jordar Sujatha about BB4 Telugu: అది నా తప్పు కాదు.. బిగ్ బాస్ నిర్ణయం: జోర్దార్ సుజాత

Bigg Boss 4 Telugu contestant Jordar Sujatha about Nagarjuna: బిగ్ బాస్ హౌజ్ నుంచి 4వ వారం జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్‌లో కారణం లేకుండా నవ్వటం, షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న స్టార్ హీరో కింగ్ నాగార్జునతో సంబోధించిన ప్రతీసారి 'బిట్టు' అని పిలవటం వల్లే సుజాత ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

Last Updated : Oct 16, 2020, 06:04 PM IST
Jordar Sujatha about BB4 Telugu: అది నా తప్పు కాదు.. బిగ్ బాస్ నిర్ణయం: జోర్దార్ సుజాత

Bigg Boss 4 Telugu contestant Jordar Sujatha about Nagarjuna: బిగ్ బాస్ హౌజ్ నుంచి 4వ వారం జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్‌లో కారణం లేకుండా నవ్వటం, షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న స్టార్ హీరో కింగ్ నాగార్జునతో సంబోధించిన ప్రతీసారి 'బిట్టు' అని పిలవటం వల్లే సుజాత ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత సుజాత ఇంటిలోని అనుభవాల గురించి ఇంటి సభ్యుల గురించి ఇంటర్వ్యూలు ( Jordar Sujatha interviews about Bigg Boss show) ఇచ్చింది. Also read : Annapurna Studios: అగ్ని ప్రమాదంపై స్పందించిన అన్నపూర్ణ స్టూడియో

ఈ క్రమంలోనే నాగార్జునని బిట్టు ( Bittu ) అని పిలవడం గురించి కూడా సుజాత క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయిన సమయంలోనే సుజాతను షో నిర్వాహకులు నాగార్జున అంటే ఇష్టమేనా అని ప్రశ్నించగా, ఇష్టమేనని సమాధానం ఇచ్చిందట. ముఖ్యంగా నాగార్జున నటించిన “మనం” సినిమా అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పిందంట… ఐతే నాగార్జునని “బిట్టు” అని పిలవమని షో నిర్వాహకులు తనకు చెప్పినట్లు సుజాత ఒక ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది. Also read : Sanjay Dutt cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సంజయ్ దత్

ఒకవేళ నాగార్జునని అలా పిలవడం నిజంగానే షో నిర్వాహకులకు, నాగార్జునకి ఇష్టం లేకపోతే వెంటనే కన్‌ఫెషన్ రూమ్‌కి పిలిచి అలా పిలవొద్దు అని చెప్పేవారు. అంతేకాకుండా నేను “బిట్టు” అని పిలవటం వల్ల నాగార్జున గారు ఎంతగానో సంతోషపడ్డారని చెప్పింది. 'ఈ విషయంలో నాపై నాగార్జున గారి అభిమానులు ఇంత సీరియస్ అవుతారని బయటకు వచ్చాకే తెలిసింది. కానీ నేను కావాలని పిలవలేదు, షో నిర్వాహకులే అలా పిలవమంటే పిలిచాను. ఒకవేళ తాను నాగార్జున గారిని అలా పిలవడం వల్ల ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి' అని నాగార్జున అభిమానులకు జోర్దార్ సుజాత క్షమాపణలు ( BB4 Telugu contestant Sujatha apology to Nagarjuna fans ) చెప్పింది. Also read : Bhanu Athaiya Dies: భారతదేశ తొలి ఆస్కార్ విజేత భాను అథియా కన్నుమూత

Trending News