Bigg Boss 4 Telugu wild card entry: బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో ఆదివారం రోజు మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ సూర్య కిరణ్ ఎలిమినేట్ ( Director Surya Kiran eliminated ) అయ్యాడు. ఇంట్లో ఉన్న  మిగతా 15 మంది కంటెస్టెంట్స్ సూర్య కిరణ్‌కి వీడ్కోలు పలకడం కూడా జరిగిపోయింది. ఇతర నామినేటెడ్ కంటెస్టెంట్స్ కంటే తక్కువ ఓట్లు సూర్య కిరణ్‌కి వచ్చినందున అతను బిగ్ బాస్ హౌజ్ ( Bigg boss house ) నుండి బయటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. Also read : Bigg Boss 4 Second Week Nominations: పడవ ప్రయాణం.. అంత ఈజీ కాదు గురూ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య కిరణ్ ఎగ్జిట్ అయిన తరువాత బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ( Bigg Boss 4 Telugu host Nagarjuna ) ప్రేక్షకులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్‌ప్రైజ్ ఏంటంటే బిగ్ బాస్ హౌజ్‌లోకి నటుడు సాయి కుమార్ పంపానా ( Sai Kumar Pampana ) మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ నివాసి అయిన సాయి కుమార్ పంపాన ఈ రోజుల్లో, బస్ స్టాప్, లవర్స్, ఆడు మగాడ్రా బుజ్జి, మామా మంచు అల్లుడు కంచు వంటి చిత్రాలలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సాయి కుమార్‌కి సినిమాలు డైరెక్ట్ చేయాలనే కోరిక కూడా ఉన్నట్టు నాగార్జునకు తెలిపాడు. అలాగే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చే సరికి కరోనావైరస్‌కి వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) వచ్చి పరిస్థితి మెరుగుపడాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. Also read : Surya Kiran Eliminated: బిగ్ బాస్ 4 తొలి ఎలిమినేషన్ ముందే ఊహించారు!



 


బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ప్రతీ సీజన్‌లో కొన్ని వారాలు గడిచిన తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీని ( Wild card entry in Bigg Boss ) పెట్టేవారు.. కానీ ఈ సీజన్‌లో ( Bigg boss Telugu season 4 ) మాత్రం ఎంటర్టెయిన్మెంట్ లోపించింది అనుకున్నారో ఏమో కాని మొదటి వారం గడవగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టారు. బిగ్ బాస్ ఫాలోవర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ లోపించిందని సోషల్ మీడియాలోనూ రివ్యూస్ వస్తుండటమే ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపైనే సోషల్ మీడియాలో రకరకలా మీమ్స్ ( Bigg boss 4 Telugu memes ) కూడా వైరల్ అవుతున్నాయి. Also read : Bigg boss 4 Telugu first weekend: బిగ్ బాస్ 4 తెలుగు ఫస్ట్ వీకెండ్.. అభిజిత్‌ని అవమానించిన అరియానా గ్లోరి