Bigg boss 4 Telugu first weekend: బిగ్ బాస్ 4 తెలుగు ఫస్ట్ వీకెండ్.. అభిజిత్‌ని అవమానించిన అరియానా గ్లోరి

Bigg boss first weekend episodes: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఫస్ట్ వీకెండ్ రానే వచ్చేసింది. హోస్ట్ కింగ్ నాగార్జున ఈ వారంలో జరిగిన విషయాలపై సరదాగా చర్చించేందుకు రెడీ అయి వచ్చేశారు. అరియానా అలా చేయడం చూసి నాగార్జునతో సహ అందరూ షాక్‌కి గురయ్యారు. అరియానా చేసిన పనికి అందరికంటే ఎక్కువ షాక్ అవడం అభిజీత్ వంతయ్యింది.

Last Updated : Sep 12, 2020, 10:25 PM IST
  • బిగ్ బాస్ హౌజ్‌లో వీకెండ్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి వచ్చిన హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు ఎలాంటి టాస్క్ ఇచ్చాడు ?
  • బిగ్ బాస్ హోస్ట్ ఇచ్చిన టాస్క్ సోహైల్, అరియానాలను ఎలా ఇరకాటంలో పడేసింది ?
  • కంటెస్టంట్స్ అమ్మ రాజశేఖర్‌ని నాగ్ ఎలా ఆటపట్టించాడు ?
  • ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తున్న నటి మోనల్ గజ్జర్‌కి నాగ్ పెట్టిన ముద్దు పేరేంటి ?
Bigg boss 4 Telugu first weekend: బిగ్ బాస్ 4 తెలుగు ఫస్ట్ వీకెండ్.. అభిజిత్‌ని అవమానించిన అరియానా గ్లోరి

Bigg boss first weekend episodes: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఫస్ట్ వీకెండ్ రానే వచ్చేసింది. హోస్ట్ కింగ్ నాగార్జున ఈ వారంలో జరిగిన విషయాలపై సరదాగా చర్చించేందుకు రెడీ అయి వచ్చేశారు. అందులో భాగంగానే సొహైల్, అరియానాలు ( Sohail, Ariyana Glory ) సీక్రెట్ రూమ్‌లో ఉన్నప్పుడు సొహైల్ అరియానాని వీపు మీద కూర్చోపెట్టుకుని పుషప్స్ చేస్తాడు. ఐతే నాగార్జున అందరి ముందు మళ్లీ ఓసారి ఆ పుషప్స్ చేయమని కోరగా వాళ్లు నాగ్ కోరినట్టుగానే చేసి చూపిస్తారు. ఆ తరువాత నాగార్జున అఖిల్‌ని పిలిచి నువ్వు 'ఎప్పుడైనా ఇలా పుషప్స్ చేశావా' అని అడగగా 'అలాంటి అమ్మాయి నాకు ఇప్పటివరకు దొరకలేదు. అందుకే చేయలేదు' అని సమాదానం ఇచ్చాడు. Also read : Bigg Boss 4 Telugu: బిగ్ బాస్‌ కంటెస్టంట్స్‌లో కట్టప్ప ఎవరో చెప్పిన నాగ్

మోనల్ గజ్జర్ ( Actress Monal Gajjar ) బిగ్ బాస్ ఇంట్లో ప్రతీసారి ఏడుస్తూ ఉండడం వల్ల ఆమెకి నాగ్ సరదాగా నర్మదా అని పేరు పెట్టేసాడు. నర్మదా అని నాగ్ పిలవగానే ఇంట్లో వాళ్లందరూ ఆ పేరుతో ఎవరు ఉన్నారా అని ఆశ్చర్యంగా చూడగా.. అప్పుడు నాగ్ 'గుజరాత్‌లో నర్మదా అనే' అనగానే మోనల్ చేయి లేపగా ఇప్పుడు మళ్లీ ఏడిచి ఇక్కడ నర్మదా నదిని పారించొద్దమ్మా అంటూ నాగ్ సెటైర్ వేశాడు. తరువాత కొరియోగ్రాఫర్ అమ్మ రాజ శేఖర్ ( Choreographer Amma Rajasekhar ), దివితో ( Actress Divi Vadthya ) ప్రేమాయణం సాగిస్తున్నాడని అమ్మ రాజ శేఖర్ వాళ్ల భార్యని స్టేజ్ మీదకి రమ్మన్నట్లుగా 'చెల్లాయ్ ఓ సారి ఇలా రామ్మ' అనగా అమ్మ రాజ శేఖర్ మొహం చాటేయడం తాజా ప్రోమోలో చూడొచ్చు. Also read : Kattappa in Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో వీళ్లలో కట్టప్ప ఎవరు ? 

అలాగే సింగర్ నోయల్‌ని ( Singer Noel Sean ) ఇంట్లో ఎంత మంది ఓవర్ థింకింగ్ అనుకుంటున్నారు అని నాగ్ ప్రశ్నించగానే.. కొంత మంది చేయి లేపి నిజంగానే నోయల్ ఓవర్‌గా థింక్ చేస్తాడు అని మనసులో మాటబం బయట పెట్టేశారు. అలాగే డైరెక్టర్ సూర్య కిరణ్‌ని ( Director Suryakiran ) ''నీకు అనవసరమైన వాటిలో తల దూర్చి లెక్చర్‌లు ఇస్తావు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ నువ్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్.. నువ్ డైరెక్టర్'' అని ఫీల్ అవుతున్నావా' అని సూర్య కిరణ్‌ని నాగ్ నిలదీశాడు. Also read : Gangavva funny dialogues: బిగ్ బాస్ హౌజ్‌లో గంగవ్వ చెప్పే ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే

అలాగే ఇంటి సభ్యుల్లో ఎవరు చెత్త కుండీతో సమానం అని అనిపిస్తుందో వారి మెడలో డస్ట్ బిన్ అనే ట్యాగ్ వేయాల్సిందిగా సొహైల్, అరియానాలకు నాగార్జున ( Bigg Boss host Nagarjuna ) ఇన్‌స్ట్రక్ట్ చేస్తాడు. అందుకు సొహైల్ ఇది చాలా అన్యాయం.. అలా ఎలా వేస్తాం అంటాడు. కాని అరియానా మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్లి నిర్మొహమాటంగా అభిజిత్ ( Bigg Boss 4 Telugu contestant Abhijeet ) మెడలో ఆ డస్ట్ బిన్ ట్యాగ్‌ని వేసేసింది. అరియానా అలా చేయడం చూసి నాగార్జునతో సహ అందరూ షాక్‌కి గురయ్యారు. అరియానా చేసిన పనికి అందరికంటే ఎక్కువ షాక్ అవడం అభిజీత్ వంతయ్యింది. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News