Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి షురూ అయ్యింది. ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఏకంగా 19 మందిని బిగ్‌బాస్‌ హౌస్‌(Bigg Boss house)లోకి తీసుకొచ్చారు. సాధారణంగా బిగ్‌బాస్‌ ఇంట్లో, షో మొదలై వారం రోజులు గడిచాక గొడవలు మొదలైతాయి. కానీ ఈ సారి మాత్రం తొలి రోజు నుంచి మాటల యుద్దం మొదలైంది. జెస్సీ మీద యానీ మాస్టర్‌(Yani Master‌) ఫైర్‌ అవ్వడం, ఎందుకంత హైపర్‌ అవుతున్నావని కాజల్‌(kajal)కు లహరి(Lahari) చురకలు అంటించడం చూస్తుంటే.. మున్ముందు గొడవలకు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) కూడా బిగ్‌బాస్‌(Bigg Boss)పై స్పందించారు. బిగ్‌బాస్‌-5లో యాంకర్‌ రవి(Anchor Ravi), యానీ మాస్టర్‌, సింగర్‌ శ్రీరామ్‌(Singer Sriram), ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌తో పాటు చాలా మంది పాల్గొన్నారని, వీరంతా తనకు ఒకెత్తు అయితే.. ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌(Priyanka singh) మరో ఎత్తు అన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఉంటుందన్నారు. 


Also Read: Bigg Boss Telugu season 5: బిగ్‌బాస్‌ హౌజ్‌లో నుంచి ఫస్ట్ బయటికి వచ్చేది నువ్వే అంటూ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విన్నర్ కౌశల్ కామెంట్స్


ప్రియాంక అబ్బాయిగా (సాయి) ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్‌ అని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిందనే విషయం చాలా సంతోషానిచ్చిందన్నారు. ట్రాన్స్‌ జెండర్‌(Transgender)గా మారాక ప్రియాంక చాలా ఇబ్బంది పడిందని, అవకాశాలు రాని సమయంలో తాను ఓ షోలోకి తీసుకొని సాయం చేశానని గుర్తు చేశారు. ప్రియాంక విన్నర్‌ అవుతుందా లేదా తనకు తెలియదని కానీ, తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఇస్తానని తేల్చి చెప్పారు. ఇక ప్రియాంక విషయానికొస్తే.. ఓ కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ(Sai Teja). ట్రాన్స్‌ జెండర్‌గా మారాక ప్రియాంక సింగ్‌ అని పేరు మార్చుకున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook