Bigg Boss captaincy Task : బిగ్ బాస్ ఆరో సీజన్ ఎంత నీరసంగా సాగుతోందో అందరికీ తెలిసిందే. ఆరువారాలు గడిచినా కూడా ఇంత వరకు టైటిల్ గెలిచే సత్తా ఉన్న కంటెస్టెంట్ ఎవరు? ఆ అర్హత ఎవరికి ఉందనే విషయంలో ఎవ్వరికీ ఓ అభిప్రాయమంటూ రాలేదు. అంటే ఈ సీజన్, అందులోని కంటెస్టెంట్లు ఎలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఉన్నవారిలో కాస్తో కూస్తో అంటే రేవంత్, గీతూ, బాలాదిత్య పర్వాలేదనిపిస్తోంది. అందులోనూ రేవంత్ తన నోటిదూల, పిచ్చి చేష్టలు, కోపంతో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక గీతూ అయితే తన చేష్టలతో ఇంటి సభ్యులనే కాదు.. చూసే జనాలను కూడా చిరాకు పెట్టిస్తోంది. గీతూ ప్రతీసారి సోది సోది అంటుంది.. కానీ ఆమె చివరకు సోదిలా మారిందని తెలుసుకోలేకపోతోంది. పక్క వారి మీద రివ్యూలు చేసుకుంటూ.. తన స్థాయి ఏంటన్నది మరిచిపోతోన్నట్టుంది. కామెడీ చేస్తున్నాను అనే భ్రమలో ఉంటోన్న గీతూ.. అందరినీ విసిగిస్తోందని తెలుసుకోలేకపోతోంది. ఆమె టాప్ 5 వరకు ఉంటుందేమో గానీ.. విన్నర్ అయితే కాలేదు.


 



బాలాదిత్య.. రాముడు మంచి బాలుడు అనే టైపులో ఉన్నాడు. గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టుకనిపిస్తోంది. వీళ్లు తప్పా మిగిలిన వారిలో అంత పసలేదనిపిస్తోంది. ఏదో ఉన్నామా? అంటే ఉన్నామా? అన్నట్టుగా ఉంది. ఆదిరెడ్డి ఏదో ట్రై చేస్తున్నాడు గానీ సెట్ అవ్వడం లేదు. సత్య, అర్జున్, వాసంతి, కీర్తి ఇలా అందరూ కూడా ఏ మాత్రం అంచనా లేని కంటెస్టెంట్లు. వాళ్లు ఎందుకు అక్కడ ఉన్నారో వాళ్లకైనా తెలుసో లేదో అన్న అనుమానం వస్తుంటుంది.


ఈ ఏడో వారంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను అర్థం చేసుకోకుండా.. తమకు నచ్చినట్టుగా చేస్తుండటం, నిర్లక్ష్యం వహించడంతో బిగ్ బాస్‌కు మండినట్టుంది. మీరంతా ఇక్కడ ఉండాల్సిన పని లేదు.. వెళ్లే వాళ్లు బయటకు వెళ్లండి.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ రద్దుఅని ప్రకటించాడు. ఎవరో ఆడిన ఇద్దరి ముగ్గురి గురించి మాకెందుకు ఈ శిక్ష అని సూర్య, శ్రీహాన్ తెగ బాధపడ్డారు.


Also Read : Pawan Kalyan Remuneration : బిడ్డల కోసం దాచిన సొమ్ముతో పార్టీ ఆఫీస్.. పవన్ కళ్యాణ్


Also Read : Renu Desai Divorce : భరణంపై రేణూ దేశాయ్ అలా.. పవర్ స్టార్ ఇలా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook