Janasena Chief Pawan Kalyan : ఆరు సినిమాలు 120 కోట్లు.. బిడ్డల కోసం దాచిన సొమ్ముని కూడా వాడా.. లెక్కల చిట్టా విప్పిన పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రెచ్చిపోయాడు. తన అకౌంట్ డీటైల్స్, జన సేన ఖాతా లెక్కలను బయటపట్టేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 01:59 PM IST
  • మీడియా ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్‌
  • జన సేన ఖాతాలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌
  • రెమ్యూనరేషన్ మీద స్పందించిన జనసేనాని
Janasena Chief Pawan Kalyan : ఆరు సినిమాలు 120 కోట్లు.. బిడ్డల కోసం దాచిన సొమ్ముని కూడా వాడా.. లెక్కల చిట్టా విప్పిన పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Remuneration : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ.. తనను ప్యాకేజీ స్టార్ అనే వైసీపీ నాయకులకు చురకలు అంటించాడు. తన లెక్కలన్నీ చెబుతూ.. ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. గత ఎనిమిదేళ్లలో తాను ఆరు చిత్రాలు చేశానని.. దాదాపు వంద నుంచి 120 కోట్లు సంపాదించానని అన్నాడు.

ఇక తన బిడ్డల కోసం దాచిన ఎఫ్‌డీ డబ్బుతోనే పార్టీ ఆఫీస్ కట్టానని అన్నాడు. ఇక ఇప్పటి వరకు 33 కోట్ల ట్యాక్స్ కట్టానని తెలిపాడు. జీఎస్టీ కాకుండా కట్టానని అన్నాడు.  21-22 లోనే దాదాపు ఐదు కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చానని పేర్కొన్నాడు. హుదుద్, సైనికుల కోసం, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫండ్ ఇలా అన్నీ కలిపి 12 కోట్లు ఇచ్చానని అన్నాడు. ఇప్పుడు జనసేన ఐదు ఖాతాల్లో దాదాపు 17 కోట్లున్నాయని అన్నాడు.

రైతు భరోసా కోసం అందరూ ఇచ్చిన నిధులు మూడు కోట్లు అని, నా బర్త్ డే నాడు అందరూ కలిసి ఇచ్చిన విరాళం నాలుగు కోట్లు అని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇలా తన లెక్కల చిట్టాలన్ని విప్పాడు. ఇకపై ఎవరైనా తనను ప్యాకేజీ స్టార్ అని అంటే.. చెప్పు తీసుకుని కొడతాను అంటూ పవన్ కళ్యాణ్‌ ఊగిపోయాడు. విశాఖలో జరిగిన ఘటనలు, వైసీపీ చేసిన కామెంట్ల మీద మండిపడ్డాడు.

మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు యాభై కోట్లు తీసుకుంటున్నాడనే టాక్ వచ్చింది. వకీల్ సాబ్ సినిమాకు సైతం యాభై కోట్లు తీసుకున్నాడనే టాక్ వచ్చింది. ఆ లెక్కన చూస్తే.. ఆరు సినిమాకు మూడొందల కోట్లు రావాలి. కానీ పవన్ కళ్యాణ్‌ చెప్పిన లెక్కల ప్రకారం ఆరు సినిమాలకు 120 కోట్లు మాత్రమే వచ్చాయట. అంటే సినిమాకు ఇరవై కోట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది.
 

Also Read :  Anasuya Bharadwaj : ఫ్లైట్‌లో డ్రెస్ చిరిగిందట.. విమానాయాన సంస్థపై అనసూయ ఫైర్

Also Read : Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x