Galata Geetu As Sanchalak : బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూని చూడాలంటేనే చిరాగ్గా ఉంటుంది. మొదటి వారంలోనే ఇంటి నుంచి బయటకు వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ నామినేషన్లో లేకపోవడంతో బతికిపోయింది. ఆమె మాట్లాడుతూ ఉంటే భరించలేకపోతోన్నాం, మ్యూట్ చేయాల్సి వస్తుందంటూ దారుణమైన ట్రోలింగ్ నడిచింది. అయితే ఉన్న కంటెస్టెంట్లలో కాస్తో కూస్తో ఆటను కొత్తగా ఆడేందుకు గీతూ ప్రయత్నిస్తుంటుంది. ఆట ఆడేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆ ఆటను మాత్రం ఆడదు. ఇంత వరకు ఆమె గెలిచిన దాఖలాలు లేవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏమైనా అంటే తానే ఆటలు ఆడతాను.. తానే గొప్ప ప్లేయర్‌ని అనే భ్రమలో గీతూ ఉంటుంది. తన ఆట ఇంకా మొత్తం చూడలేదని, చూపిస్తానంటూ తెగ ఆత్రం అవుతుంటుంది. ఈమె మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. చెప్పేదానికి చేసే దానికి అస్సలు సంబంధం ఉండదు. గీతూ తానేం చేసినా రైట్ అని వాదిస్తుంటుంది. ఆమె ఎవరి మధ్యలోకి దూరైనా మాట్లాడుతుంది. కానీ ఈమె మ్యాటర్లో మాత్రం ఎవ్వరూ దూరకూడదన్నట్టుగా చేస్తుంది.


ఆమె రూల్స్ చెబుతుంది. కానీ రూల్స్ పాటించదు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ కూడా పాటించదు. తనకు నచ్చినట్టుగా, పిచ్చి పిచ్చిగా ఆడేస్తుంటుంది. తాను గెలవాలని ఎప్పుడు కూడా ఆడదు. పక్క వాళ్లని ఎలా తొక్కేయాలి.. ఎవరిని ఎలా రెచ్చగొట్టాలి, వీక్ పాయింట్ల మీద ఎలా కొట్టాలనే కుళ్లు కుతంత్రాలతోనే ఆలోచిస్తుంటుంది. కానీ ఎప్పుడు కూడా నేరుగా ఆట ఆడలేదు. చేపల చెరువు టాస్కులోనూ అంతే. రేవంత్,మెరినా, కీర్తిలను రెచ్చగొడదామని చూసింది. పక్క వారిదాంట్లోంచి లాగేసుకుందామని చూసింది. చివరకు తక్కువ చేపలు పట్టుకోవడం ఆట నుంచి తప్పుకుంది.


 



అలా ఆట నుంచి తప్పుకున్న ఆదిరెడ్డి, గీతూలని సంచాలక్‌లుగా నియమించాడు బిగ్ బాస్. సంచాలక్‌ అని గీతూ తనకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ పెట్టింది. చేపలన్నీ కూడా బుట్టలోనే ఉండాలని రూల్ పెట్టడంతో అందరూ రివర్స్ అయ్యారు. సంచాలక్ అయినా కూడా చేపలు పడుతూ తనకు నచ్చిన వారికి సాయం చేస్తూ వచ్చింది. సంచాలక్‌ అయిన తరువాత ఇలా ఆట ఆడకూడదని ఆదిరెడ్డి, రేవంత్ అందరూ చెప్పారు. నేను ఆడటం లేదు, ఆడిస్తున్నాను అని గీతూ కవర్ చేసుకుంది.


ఇది కరెక్ట్ కాదు.. ఇంత వరకు సంచాలక్ ఎక్కడైనా ఆట ఆడటం చూశారా? అంటూ ఆదిరెడ్డి పరువుతీశాడు. ఎంపైరే ఆట ఆడినట్టుంది అని బాలాదిత్య చురకలు అంటించాడు. ఇలాంటి పిచ్చి చేష్టలు, తింగరి ఆలోచనలు చేసి గీతూ తన పరువుతానే తీసుకుంటుంది. ఈ అతి తెలివి, మూర్ఖత్వమే గీతూని విజేతగా నిలబెట్టవు. బిగ్ బాస్ హిస్టరీలో వరస్ట్ అండ్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకునేలా ఉంది.


Also Read : Bigg Boss Geetu : ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది.. గలాట గీతూ ఇక మారదా?


Also Read : Samantha Face Surgery : సమంత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ?.. ఆ ఫోటోలతోనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి