Samantha Face Surgery : సమంత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ?.. ఆ ఫోటోలతోనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయా?

Samantha Ruth Prabhu Surgery సమంత  మొహానికి సర్జరీ జరిగిందనే రూమర్లు గత రెండ్రోజుల నుంచి ఎక్కువయ్యాయి. అసలే సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 08:29 AM IST
  • సమంత మొహంలో మార్పులు
  • లెటెస్ట్ ఫోటో షూట్ వైరల్
  • సమంత సర్జరీపై రూమర్లు
Samantha Face Surgery : సమంత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ?.. ఆ ఫోటోలతోనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయా?

Samantha Face Surgery : సమంత మీద నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సమంత ఎంత సైలెంట్‌గా ఉంటున్నా కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. సమంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. తన పని తాను అన్నట్టుగా సైలెంట్‌గా చేసుకుంటూ ఉంటోంది. ట్రోలర్లకు కౌంటర్లు లేవు.. రూమర్ల మీద ఖండనలు లేవు. అయితే గత నెలలో సమంతకు చర్మ వ్యాధి సోకిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై సమంత మేనేజర్ నుంచి ఖండన ప్రకటన వచ్చింది.

మామూలుగా అయితే సమంతే అలాంటి రూమర్లను చీల్చి చెండాడుతుంది. సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తుంది.కానీ సమంత ఎందుకో మొత్తానికే సైలెంట్ అయింది. సమంత ఇంతలా సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలియడం లేదు. అయితే సమంతకు గతంలోనే చర్మానికి సంబంధించిన వ్యాధి ఉందని, ఇప్పుడు మళ్లీ అది ఎక్కువైందని, అందుకే షూటింగ్‌లకు దూరంగా ఉంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఏకంగా సమంత మొహానికి సర్జరీ జరిగిందనే రూమర్లు బయటకు వచ్చాయి. ఆమె తాజాగా చేసిన యాడ్, అందులోని ఫోటోలను గమనిస్తే సమంత మొహంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం కూడా సమంత సర్జరీ గురించి మాట్లాడుకుంటోంది. అయితే ఇందులో నిజమెంత ఉందనేది సమంతకు మాత్రమే తెలియాలి.

త్వరలోనే సమంత యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యశోద సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు సమంత రావాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలోనైనా ఇలాంటి రూమర్ల మీద స్పందించి.. ఖండిస్తుందో లేదో చూడాలి. విడాకుల సమయంలో తన మీద వచ్చిన ఆరోపణలు, రూమర్ల మీద అయితే సమంత గట్టిగా పోరాడింది. కోర్టు వరకు అందరినీ లాగింది. సమంత తన మీద వస్తోన్న సర్జరీ రూమర్లను ఎలా తీసుకుంటుంది? ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాలి.

ఇక సమంత శాకుంతలం సినిమా కూడా రెడీగానే ఉంది. కానీ శాకుంతలం రిలీజ్ డేట్ విషయంలో మేకర్లు ఇంకా నిర్ణయాన్ని తీసుకోలేకపోతోన్నారు. ఖుషీ సినిమా షూటింగ్ అప్డేట్ లేకుండానే పోయింది. కాశ్మీర్‌లో విజయ్, సమంతల మీద ఓ షెడ్యూల్‌ను డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Also Read : Veera Simha Reddy story leaked: రొటీన్ రొట్ట స్టోరీనా.. మరి అంత ధైర్యం ఎందుకబ్బా?

Also Read : Chiranjeevi Tweet: మృగాళ్లను కఠినంగా శిక్షించాలి.. బంజారాహిల్స్‌ ఘటనపై చిరంజీవి ఆవేదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News