Bigg Boss satya and geetu : బిగ్ బాస్ తొమ్మిది వారానికి ఆడియెన్స్ కోరుకున్నది, అనుకున్నది జరుగుతోంది. మొదటి వారం నుంచి గీతూని ఎలిమినేట్ చేయాలని ఆడియెన్స్ బాగానే పరితపించారు. కానీ బిగ్ బాస్ టీం మాత్రం ఆమెను కాపాడుతూనే వచ్చింది. ఆమె సైతం ఆటల్లో అంతో ఇంతో యాక్టివ్‌గా ఉంది. అలాంటి ఓ పిచ్చి, వింత కారెక్టర్ కూడా బిగ్ బాస్ ఇంట్లో ఉంటే బాగుంటుందని టీం భావించినట్టుంది. అందుకే గీతూ మీద ఎంత నెగెటివిటీ పెరుగుతున్నా కూడా ఆమెను మాత్రం ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసినట్టున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె పిచ్చి బాగా ముదిరిపోయింది. బిగ్ బాస్ టీం, బిగ్ బాస్, నాగార్జునను కూడా లెక్కచేయనంత మూర్ఖంగా ప్రవర్తించింది గీతూ. ఇక ఎనిమిదో వారంలో పడ్డ దెబ్బకు గీతూ ఏ మాత్రం మారలేదు. బుద్ది బలం ఉపయోగించండని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో గీతూ తెగ రెచ్చిపోయింది. తనకు మాత్రమే బుద్ది ఉందని, మిగతా వాళ్లకు లేదని భ్రమలో బతుకుతుంటుంది. అలా ఈ మిషన్ పాజిబుల్ టాస్కులో గీతూ తెగ రెచ్చిపోయింది.


రెడ్ టీం లీడర్‌గా గీతూ చాలా ఓవర్ చేసింది. సత్య, శ్రీహాన్, గీతూలే తెలివైన వాళ్లని అనుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఆడారు. వీక్ నెస్ వీక్ నెస్ అంటూ బాలాదిత్య, ఇనయలను టార్గెట్ చేశారు. టాస్కులో గెలిచామని, తమ టీం సభ్యులు బంగారుకొండలని, తానేం చెబితే అది చేశారంటూ గీతూ తెగ సంబరపడిపోయింది.


 



కానీ ఆ టాస్క్ ఎలా ఆడారో మరిచిపోయారు. పిచ్చి పిచ్చిగా వెక్కిరించడం, ఉన్మాదుల్లా ప్రవర్తించడం, వీక్ నెస్, లూప్స్ అంటూ ఆడటంతో దెబ్బ పడింది. చివరికు గీతూ, సత్యలకే ఈ వారం తక్కువ ఓట్లు వచ్చాయి. మామూలుగా అయితే ఈ వారం సత్యను పంపించాలనే క్యాంపైన్ సోషల్ మీడియాలో జరిగింది. కానీ ఆమె కెప్టెన్ అయ్యే సరికి గీతూని పంపిస్తున్నారా? లేదంటే నిజంగానే గీతూకే తక్కువ ఓట్లు వచ్చాయా? అన్నది తెలియడం లేదు.


కానీ సత్య, గీతూలు చివరి స్థానంలోకి వచ్చారు. తాము ఆ స్థానానికి ఎందుకు వచ్చారు? చేసిన తప్పులు ఏంటి? అనేది తెలుసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. అయితే సత్య ఈ వారం శ్రీహాన్‌తో కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదు. చేతులు పట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం కూడా దెబ్బ కొట్టేసినట్టు అనిపిస్తోంది.


Also Read : Pooja Hegde Leg Injury : పూజా హెగ్డే కాలికి గాయం.. కోలుకుంటోన్న బుట్టబొమ్మ.. పిక్ వైరల్


Also Read : HBD Shekar Master : జీవితంలో మరిచిపోలేనంటూ ఎమోషనల్.. వాల్తేరు వీరయ్య సెట్‌లో శేఖర్ మాస్టర్‌కు చిరు సర్ ప్రైజ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook