Bigg Boss 6 Telugu Prize Money : బిగ్ బాస్ సీజన్లు మారుతున్నాయ్ గానీ.. ఇచ్చే డబ్బు మాత్రం మారడం లేదు. పైగా అందులోనూ బిగ్ బాస్ టీం కక్కుర్తి పనులు చేస్తుంటుంది. ఇచ్చే యాభై లక్షల్లోనే బేరసారాలు పెడుతుంటుంది. అలా నాలుగో సీజన్‌లో విన్నర్ అయిన అభిజిత్‌కు వచ్చింది ఇరవై ఐదు లక్షలే. మధ్యలో ఆట నుంచి తప్పుకున్న సోహెల్‌కు కూడా అంతే వచ్చింది. రన్నర్‌ అయిన అఖిల్‌ చేతికి చిప్ప వచ్చినట్టు అయింది. ఇక బిగ్ బాస్ ఓటీటీలో అరియానా పదిలక్షలు పట్టుకుని పోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్ని సీజన్లు ఒకెత్తు అయితే.. ఈ ఆరో సీజన్‌లో కొత్త పథకం పెట్టారు. యాభై లక్షల ప్రైజ మనీలోంచి ప్రతీ వారం కొంత కట్ అయ్యేట్టు కనిపిస్తోంది. నిన్న బిగ్ బాస్ బలవంతంగా ఓ టాస్క్ ఆడారు. నామినేట్ అయిన వారిలోంచి ఒకరికి ఇమ్యూనిటీ వస్తుందని కానీ దాని కోసం గరిష్టంగా ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. ఎవరో ఒకరు కచ్చితంగా ఇమ్యూనిటీని తీసుకోవాల్సిందేనని, అలా జరగకపోయినా ప్రైజ్ మనీలోంచి ఐదు లక్షలు మాత్రం కట్ అవుతాయని చెప్పాడు.


అలా రాజ్ తన తెలివితో కాస్త మంచి అమౌంట్ రాశాడు. దీంతో రూ. 4,99,700లతో రాజ్ సేవ్ అయ్యాడు. అలా చివరకు 45, 00, 300లు మాత్రమే మిగిలాయి. అది సరిపోదన్నట్టుగా బిగ్ బాస్ ఇంకో మెలిక పెట్టాడు. ఇకపై ప్రతీ టాస్కుకు కొంత అమౌంట్ కట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఆట సరిగ్గా ఆడకపోయినా, టాస్కులు పూర్తి చేయకపోయినా కొంత అమౌంట్ వేస్ట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.


అలా నిన్న ఏడు నిమిషాల్లో వంద రన్స్ తీయాలనే టాస్క్ ఇచ్చాడు. రేవంత్, రోహిత్ కలిసి ఏడు నిమిషాల్లో దాదాపు ఎనభై రన్స్ మాత్రమే తీయగలిగారు. దీంతో టాస్కు ఓడిపోవడంతో ప్రైజ్ మనీలోంచి మరో లక్ష తగ్గింది. అలా నిన్నటి ఎపిసోడ్ ముగిసే వరకు రూ. 45, 00, 300లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది రాను రాను తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక వేళ కంటెస్టెంట్లు గెలిస్తే ఆ అమౌంట్ పెరుగుతుందేమో. కానీ బిగ్ బాస్ టీం మాత్రం గెలిచే టాస్కులు ఇవ్వదు. ఈ లెక్కన బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రైజ్ మనీ దారుణంగా ఉండేట్టు కనిపిస్తోంది.


Also Read : Siri-Shrihan : శ్రీహాన్ లవర్‌ను ఎత్తుకున్న మానస్.. బిగ్ బాస్ బ్యూటీ సిరి పిక్స్ వైరల్


Also Read : Bigg Boss Satya : శ్రీ సత్య మొహం మాడింది.. బిగ్ బాస్ దెబ్బ అదుర్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook