Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 రోజుకో మలుపు తిరుగుతోంది. గత వారం డబుల్ ఎలిమినేషన్‌తో హౌస్‌మేట్స్‌కు షాక్ ఇచ్చింది బిగ్ బాస్ టీమ్. దీంతో చివరకు ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఈ వారం అమర్ మినహా మిగిలిన ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఈసారి పెద్ద తలకాయే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టిక్కెట్ ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే రేసు నుంచి శివాజీ, శోభా మరియు ప్రియాంక తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఫినాలే కంటెస్టెంట్ గా ఎవరు ఎంపిక అవుతారు? ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారు? అనే విషయాల్లో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13వ వారం నామినేషన్స్‌లలో ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్, శివాజీ, శోభా శెట్టి, గౌతమ్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ పరంగా 30.23 శాతం ఓట్లతో పల్లవి ప్రశాంత్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.  27.76 శాతం ఓటింగ్‌తో హీరో శివాజీ రెండో స్థానంలో, 13.98 శాతంతో ప్రిన్స్ యావర్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు. 8.22 శాతంతో అర్జున్ నాలుగో స్థానంలోనూ, 6.97 శాతంతో శోభా ఐదో స్థానంలోనూ నిలిచారు. ఇక చివరి రెండు స్థానాల్లో ప్రియాంక, గౌతమ్ ఉన్నారు. ప్రస్తుతం  6.84 శాతంతో ప్రియాంక ఆరో స్థానంలో, 5.99 శాతం ఓట్లతో గౌతమ్ ఏడో స్థానంలో ఉన్నారు. 


Also Read: Tiger3: సల్మాన్ ఖాన్ సినిమాలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్.. భర్త విక్కీ కౌశల్ షాకింగ్ కామెంట్స్


అయితే శివాజీతో గొడవ కారణంగా గౌతమ్, అర్జున్ పై నెగిటివిటీ బాగా పెరిగింది. దీంతో వీరిద్దరికీ ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉంది. దానికి తోడూ గత కొన్ని వారాలుగా అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. కాబట్టి ఈ సారి కచ్చితంగా మేల్ కంటెస్టెంట్ హౌస్ నుండి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌతమ్, అర్జున్ ఇద్దరూ ఇప్పటి వరకు సోలో గేమ్ ఆడుతూ వస్తున్నారు. ఏ బ్యాచ్ తో కలవకుండా తటస్థంగా వీరిద్దరూ చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. మరి ఈ బెస్ట్ ప్రెండ్స్ లో ఎవరూ ఎలిమినేట్ అవుతారో చూద్దాం. 


Also Read: Ravi Teja : మరోసారి ఆ ఓల్డ్ హీరోయిన్ తో రవితేజ.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook