Ravi Teja : మరోసారి ఆ ఓల్డ్ హీరోయిన్ తో రవితేజ.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

Harish Shankar: ప్రస్తుతం సూపర్ హిట్ అవసరమైన మన మాస్ మహారాజా రవితేజ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో తన తదుపరి సినిమా చెయ్యనున్నారని కొద్దిరోజులుగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఒక షాకింగ్ వార్త తెలిసింది. అదేమిటో ఒకసారి చూద్దాం

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 09:05 AM IST
Ravi Teja : మరోసారి ఆ ఓల్డ్ హీరోయిన్ తో  రవితేజ.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

Ileana: ఒకప్పుడు వరస హిట్లు సంపాదించుకున్న హీరో రవితేజ ప్రస్తుతం మాత్రం ఒక సూపర్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈమధ్య రవితేజ కి ఒక్క హిట్ వస్తే ఆ తర్వాత వెంటనే మూడు నాలుగు డిజాస్టర్లు వస్తున్నాయి. క్రాక్ ..ధమాకా మినహా ఈ హీరో ఈ మధ్య హీరోగా నటించిన సినిమాలలో పెద్దగా చెప్పుకోదగిన చిత్రాలే లేవు. 

కాగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు డిజాస్టర్ లను చవిచూశాయి. అంతేకాదు రవితేజ గోపీచంద్ మళ్లీనేని తో ఒక సినిమా స్టార్ట్ చేయగా అది కూడా ఆగిపోయింది అని తెలుస్తుంది. గోపీచంద్ రవితేజ కి డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సూపర్ హిట్లు ఇచ్చారు.. కానీ వరస ప్లాపుల వల్ల రవితేజ మార్కెట్ తగ్గిపోయి గోపీచంద్ తో రవితేజ చేస్తున్న సినిమాకి బడ్జెట్ ప్రాబ్లం రావడం వల్లే ఈ చిత్రం ఆగింది అని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

ఇక ఈ సినిమా ఆగిపోయినా కానీ.. తనకి మిరపకాయ.. లాంటి సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో రవితేజ ఒక సినిమా చేయనున్నారు. ఈ వార్త కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుండగా ఇందులో నటించబోయే హీరోయిన్ గురించి ఇప్పుడు వినిపిస్తున్న వార్త అందరిని షాక్ చేస్తూ ఉంది.

ఈ సినిమాలో రవితేజ కి జోడీగా ఇలియానా నటించనున్నారు అనేది లేటెస్ట్ టాక్. ఇది విన్న రవితేజ అభిమానులు.. ఎందుకు రవితేజ సినిమా లో అంత ఓల్డ్ హీరోయిన్ ని తీసుకుంటున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇలియానా తెలుగు సినిమాలకు దూరమై చాలా సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెని ఫస్ట్ హీరోయిన్గా తీసుకుంటారా లేదా ఏదన్న ముఖ్యపాత్రలో తీసుకుంటారా అనేది ఇంకా తెలియాల్సిన విషయం. కాగా గతంలో రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో కిక్, ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని మూవీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీ మాస్ యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. త్వరలో ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News