Bigg Boss 7 Telugu latest Promo: అనుహ్యమైన ట్విస్టులతో బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ ఊడినట్లు చూపించారు. దీంతో ప్రశాంత్ కన్నీరు మున్నీరు అయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెప్టెన్ అంటే ఎలా ఉండాలి అని హౌస్ మేట్స్ ని అడిగారు బిగ్ బాస్. దీంతో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో సమాధానం చెప్పారు. ముందుగా శోభ మాట్లాడుతూ.. కెప్టెన్ అంటే ఇంట్లో అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవాలని చెబుతుంది.  ఆ తర్వాత అమర్ దీప్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలన్నాడు. సందీప్ హౌస్ లో ఉన్న వారిని మ్యానేజ్ చేయాలనీ, అర్జున్ అంబటి కెప్టెన్ అంటే హౌస్ లో రెండో బిగ్ బాస్ అని, ఎబిలిటీస్ ఇంపార్టెంట్ అని శివాజీ చెప్పారు. 


ఆ తర్వాత కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని ప్రశాంత్ ను అడిగారు బిగ్ బాస్. దానికి నేను పని చేస్తూ.. మిగతా వాళ్ళతో పనిచేయించాలని చెప్పాడు. అంతేకాకుండా ఎవరూ తన మాట వినడం లేదని. . కొన్ని పనులు చెప్పినా కూడా వీడెంటి అన్నట్టు చూస్తున్నారని ప్రశాంత్ చెప్పాడు. ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడగ్గా.. అందరు చేయి పైకి లేపారు. దాంతో రైతు బిడ్డను కెప్టెన్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. దీంతో ప్రశాంత్ కన్నీరుమున్నీరయ్యాడు. 



బిగ్ బాస్ హౌస్ లోకి రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. టాస్క్ లో కష్టపడి ఆడి ప్రేక్షకులను మనసులు గెలుచుకున్నాడు ప్రశాంత్. అంతేకాకుండా హౌస్ తొలి కెప్టెన్ కూడా అయ్యాడు. టాస్క్ ల్లో ఆడి మంచి ఆటతీరును కనబరిచిన రైతు బిడ్డ కెప్టెన్ గా విఫలమయ్యాడు. దీంతోఅందరూ అతడికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రశాంత్ కెప్టెన్సీ పోయినట్లు తెలుస్తోంది.


Also Read: Actor Nassar: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. నాజర్ తండ్రి కన్నుమూత..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి