Actor Nassar: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. నాజర్ తండ్రి కన్నుమూత..

Actor Nassar: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.  విలక్షణ నటుడు నాజర్ తండ్రి  మంగళవారం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2023, 09:57 PM IST
Actor Nassar: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. నాజర్ తండ్రి కన్నుమూత..

Nassar Father Passes away: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ తండ్రి మహబూబ్ భాషా (94) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ(అక్టోబరు 10) తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఆయన తీవ్ర ఆస్వస్థతకు గురవడంతో.. భాషాను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఆయన స్వర్గస్థులయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్‌మలైలోని స్వగృహంలో ఆయన మృతి చెందారు. నాజర్ తండ్రి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. భాషా అంత్యక్రియలు చెంగల్పట్టులో రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

నాజర్ కు విలక్షణ నటుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆయన ఎన్నో తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రేక్షకుల అలరిస్తున్నారు.  తన కెరీర్‌ తొలినాళ్ల నుంచి మాబూబ్ బాషానే అండగా నిలిచారని నాజర్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాజర్  ధనుశ్ నటిస్తోన్న కెప్టెన్ మిల్లర్ మూవీలో కీలకపాత్ర చేస్తున్నాడు. 

దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం
సోమవారం(అక్టోబరు 09) టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌రెడ్డి (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న రాత్రి ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో దిల్ రాజు దుఃఖసాగరంలో మునిగిపోయారు. దీంతో సిని ప్రముఖులు ఆయన పరామర్శిస్తున్నారు. దిల్ రాజు మొద‌టి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించగా.. 2020లో తేజస్వినిని రెండో  వివాహం చేసుకున్నారు.

Also Read: Dil Raju Father Passed Away: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News