Bigg Boss 7 Telugu latest Promo: తెలుగు బిగ్ బాస్ ఊహించని ట్విస్టులతో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడో పవరాస్త్ర కోసం ముగ్గురు కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసిన బిగ్ బాస్.. మిగతా వారిలో ఒక్కొక్కరిని కన్షెషన్ రూమ్ కి పిలిచి అనర్హులు ఎవరో చెప్పాలని కోరారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పారు. ముందుగా ప్రిన్స్ యావర్ అర్హుడు కాదని చెప్పిన వారు ఎవరో బిగ్ బాస్ రివీల్ చేశాడు. ఇందులో రతిక కూడా ఉంది. అంతగా నమ్మిన రతికనే వెన్నుపోటు పొడవడంతో ప్రిన్స్ హార్ట్ అయ్యాడు. దీంతో ఇంట్లో రచ్చ రచ్చ చేశాడు. అయితే అదే దెబ్బేసిన రతికతో ప్రిన్స్ రొమాన్స్ చేస్తున్న వీడియోను తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెచ్చిపోయిన రతిక-ప్రిన్స్
ఈ ప్రోమోలో ప్రిన్స్ యావర్, రతిక, శివాజీ కిచెన్ లో ఉంటారు. ఆ సమయంలో రతిక ప్రిన్స్ ను చూస్తూ ఉంటుంది. తనవైపు చూస్తున్న రతికతో నేను నీకోసం ఎప్పుడూ ఉంటాను. రోటి తింటావా. ఏమైంది.. లైట్ తీస్కో అని యావర్ చెప్తాడు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ప్రశాంత్ వీళ్ల సరసాలు తగలెయ్యా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.  ఆ తర్వాత టేబుల్ దగ్గర కూర్చుని ప్రిన్స్ యావర్, రతిక ఒకరికొకరు తినిపించుకుంటారు. దీంతో హౌస్ అంతా షాక్ అవుతుంది.  


Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ


శివాజీ ఫైర్
రతికలాగా  ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే ప్లేట్‍లో తింటే కడగటానికి ప్లేట్లు తగ్గిపోతాయి కదా అంటూ టేస్టీ తేజా సెటైర్ వేయడాన్ని ప్రోమోలో చూపించారు మేకర్స్. మరోవైపు శివాజీ తన  పవరాస్త్ర కొట్టిసిన వారిపై ఫైర్ అవుతాడు.. ఎవరైతే దీని వెనుక మాస్టర్ మైండ్ ఉన్నారో వాళ్ల తాట తీస్తానంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతాడు శివాజీ. ఇంకోవైపు దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. ఆయన హీరో అయితే.. నేను విలన్ అవుతా అని ప్రియాంకతో అమర్ దీప్ అనటాన్ని బిగ్ బాస్ ప్రోమోలో చూపించారు. 



Also Read: Bigg Boss Telugu 7: ఓటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్ హీరో.. ఆమె ఎలిమినేషన్ తప్పదా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook