Bigg Boss 7 Telugu Updates: బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 07 రోజు రోజూకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున ముందుగానే చెప్పినట్లు ఈసీజన్ ఉల్టా పుల్టాగా సాగుతోంది. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ ను కాస్త డిఫరెంట్ గా ఫ్లాన్ చేశారు మేకర్స్. అంతకముందు సీజన్స్ లో హౌస్ లోకి 20 మందిని పంపేవారు. ఈ సారి దాని విరుద్ధంగా 14 మందిని హౌస్ లోకి పంపారు. అంతేకాకుండా వెళ్లిన 14 మంది హౌస్ మేట్స్ అయ్యేందుకు టాస్కుల్లో గెలవాల్సి ఉంటుంది. ఇప్పటికీ ముగ్గురు మాత్రమే హౌస్ మేట్స్ కన్ఫార్మ్ అయ్యారు. ఈ వారం మరొకరు హౌస్ మేట్ అవుతారు. ఇప్పటికే ముగ్గురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి భారీగా వైల్డ్ ఎంట్రీలు ఉంటాయని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఈవెంట్ ను అక్టోబరు 09న ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఆరుగురిని హౌస్ లోకి పంపేందుకు మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో కొంత మంది పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి. ఇందులో సీరియలన్ నటి అంజలి, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ భోలే షావలి, హీరోయిన్‌ ఫర్జానా, సురేఖావాణి కూతురు సుప్రిత, జబర్దస్త్ ఫేమ్ నరేష్‌, నటి పూజా మూర్తి ఉన్నారని తెలుస్తోంది.


Also Read: Hero Vishal: సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు.. రూ.6.5 లక్షలు లంచం ఇచ్చానంటూ..


అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి డాక్టర్ బాబు గౌతమ్ కు ఊహించని విధంగా ఓట్లు పడ్డాయి. దీంతో ఇతడు టాప్-2లోకి దూసుకొచ్చాడు. గత వారం లాగే ఈ వీక్ యావర్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాత స్థానాల్లో ప్రియాంకజైన్, శుభ శ్రీ, రతిక రోజ్, టేస్టీ తేజా ఉన్నారు. రతిక లేదా తేజాల్లో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  


Also Read: Actor Siddharth: బెంగళూరులో హీరో సిద్ధార్థ్​కు ఘోర అవమానం, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook