Actor Siddharth: బెంగళూరులో హీరో సిద్ధార్థ్​కు ఘోర అవమానం, వీడియో వైరల్

Siddharth: కోలీవుడ్ హీరో సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయనను నిరసనకారులు బలవంతంగా పంపించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2023, 07:22 AM IST
Actor Siddharth: బెంగళూరులో హీరో సిద్ధార్థ్​కు ఘోర అవమానం, వీడియో వైరల్

Siddharth Insulted: హీరో సిద్ధార్థ్​కు ఘోర అవమానం జరిగింది. ‘చిత్తా’(తెలుగులో ‘చిన్నా’) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా....బెంగళూరులోని ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు సిద్ధార్ధ్. అయితే ఈ విలేకర్ల సమావేశాన్ని కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పని? అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. అంతేకాకుండా వెంటనే ప్రెస్ మీట్ ఆపాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు ఆందోళన ఆపకపోవడంతో.. కాసేపు మౌనంగా ఉన్న సిద్ధార్ధ్ విలేకరులకు వీడ్కోలు తెలిపి వేదికపై నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఘటనపై నెటిజన్స్ సిద్ధార్థ్​కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఓ హీరోను ఇలా అవమానించడం కరెక్ట్ కాదంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 

సిద్ధార్థ్​ లీడ్ రోల్ లో నటించిన చిత్రం చిన్నా. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ గుురవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీని సిద్థార్ధ్ తన సొంత బ్యానర్‌ ఎతకీ ఎంటర్‌టైన్మెంట్ పై నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్థార్ధ్ కు జోడిగా మలయాళ నటి నిమిషా సాజయన్ నటించింది. కోలీవుడ్ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమా తెలుగులో కూడా సెప్టెంబరు 28న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అదే రోజు స్కంద, చంద్రముఖి 2 విడుదల కావడంతో.. చిన్నా సినిమాని అక్టోబరు 06కు వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. 

AlsoRead: Mister Pregnant OTT: ఓటీటీలోకి రాబోతున్న 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x