Bigg Boss 7 Telugu Voting: సడెన్‌గా మారిపోయిన ఓటింగ్ లెక్కలు.. డేంజర్ జోన్లో ఆ బ్యూటీ...
Bigg Boss 7 Telugu: గంటల్లోనే ఒక్కసారిగా టాప్ లోకి దూసుకొచ్చారు. సేఫ్ అనుకున్న హౌస్ మేట్స్ ఒక్కసారిగా డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఈ వారం ఎలిమినేట్ అవుతారా అని అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది.
Bigg Boss 7 Telugu 13th week elimination: పాపులర్ తెలుగు షో బిగ్ బాస్ సీజన్ 07 చివరి దశకు చేరుకుంది. ముగింపుకు వచ్చే కొద్దీ షోను మరింత రక్తికట్టిస్తున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టే హౌస్ మేట్స్ కూడా తమ గేమ్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం 13వ వారం నడుస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో అమర్ మినహా ఏడుగురు ఉన్నారు. వారే శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ వీక్ చివరకి వచ్చే సరికి ఓటింగ్ లెక్కలన్నీ మారిపోయాయి. నిన్న మెున్నటి వరకు ఎలిమినేట్ అవుతారనుకున్న గౌతమ్, అర్జున్ సడన్ గా ఓటింగ్ లో పైకి ఎగబాకారు.
ఓటింగ్ విషయానికొస్తే.. ఎప్పటిలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ 27 శాతం ఓట్లుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక 22 శాతం ఓట్లుతో శివాజీ రెండో స్థానంలోనూ, 13 శాతం ఓట్లతో ప్రిన్స్ యావర్ మూడో స్థానంలోనూ ఉన్నారు. నిన్నటి వరకు ఆఖరి స్థానంలో ఉన్న గౌతమ్ 11శాతం ఓట్లతో ఇప్పుడు ఏకంగా నాలుగో స్థానంలోకి దూసుకొచ్చాడు. 10 శాతం ఓట్లతో అంబటి అర్జున్ ఐదో స్థానంలోనూ, 07 శాతం ఓట్లతో ప్రియాంక జైన్ ఆరో స్థానంలో ఉన్నారు. ఇక 6.9 ఓట్లతో శోభా చివరి స్థానంలో ఉంది.
ఈ వారం గేమ్ విషయానికొస్తే.. ప్రశాంత్ ప్రతి టాస్కులోనూ అదరగొట్టి ఫినాలే టికెట్ కు కొంచెం దూరంలో ఉన్నాడు. మరోవైపు యావర్, అర్జున్, గౌతమ్ కూడా బాగానే ఆడారు. అమర్ బాగా ఆడినప్పటికీ అందరినీ ఓట్లు అడగడం జనాలకు నచ్చలేదు. మరోవైపు ఈ వారం శోభా అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేయడం, అమర్ ను రెచ్చగొట్టడం, ప్రియాంకపై నెగిటివిటీ పెంచుకోవడం ఆమె ఓటింగ్ పడిపోవడానికి కారణాలుగా తెలుస్తోంది. ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న బిగ్ బాస్ ముద్దుబిడ్డ శోభాను ఈ వారమైన ఎలిమినేట్ చేస్తారో లేదా మరొకరిని బలి చేస్తారో లేదా నామినేషన్ లేకుండా చేస్తారో వేచి చూడాలి.
Also Read: Bigg Boss Telugu 7 : ఫినాలే రేసులో దూసుకుపోతున్న ఆ ఇద్దరు.. ఒక్క అడుగు దూరంలో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook