Manas: ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ వివాహం.. వీడియో వైరల్
Manas wedding: సీరియల్ ద్వారా, ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా మనకు బాగా దగ్గరైన నటుడు మానస్.. ఈ మధ్యనే విజయవాడ అమ్మాయి శ్రీజా తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఈయన. ఇక ఇప్పుడు ఒక ఇంటివాడు అయిపోయాడు. ఇక నిన్న జరిగిన మానస పెళ్లి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Manas wedding: బిగ్ బాస్ షో లో ఒక రెండు వారాలు ఉన్నా చాలు.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోతూ ఉంటారు ఆ కంటెస్టెంట్స్. కాగా సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకొని ఆ తరువాత బిగ్ బాస్ లో కూడా కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నటుడు మానస్. బిగ్ బాస్ లో ప్రియాంకతో ఫ్రెండ్లీగా ఉంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఈయన.
పెద్దగా వివాదాలకు పోకుండా వచ్చిన మానస్.. బిగ్ బాస్ లో విన్నర్ గా మాత్రం నిలబడలేకపోయాడు. కాగా ఇప్పుడు ఈ నటుడు పెళ్లి పీటలు ఎక్కాడు. ఆయన పెళ్లి వీడియో, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
సీరియల్స్, బిగ్ బాస్ లోనే కాకుండా కొన్ని సినిమాలలో కూడా మానస్ నటించాడు. కాగా ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా ఈయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్యనే సెప్టెంబర్ 2న మానస్ శ్రీజ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. విజయవాడకు చెందిన ఈ అమ్మాయితో మానస్ ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. కాగా ఇప్పుడు ఈ నా పెళ్లి పీటలు కూడా ఎక్కేశాడు.
నిన్న బుధవారం రాత్రి..విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా మానస్ – శ్రీజల వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు సినీ, టీవీ ప్రముఖుల హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు, పలువురు ప్రముఖులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి