బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ రియాన్ తన మాట నిలబెట్టుకున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షోలో గెలిచిన మొత్తంలో రూ. 10 లక్షలు అనాథశ్రమాలకు విరాళంగా అందిస్తానని షోలో అందరు ఆడియెన్స్, బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున, షో చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి ముందు మాట ఇచ్చిన సోహెల్.. ఆ ప్రకారమే బుధవారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో ఆ డబ్బును విరాళంగా అందించాడు. తాను ఎంపిక చేసుకున్న 5 అనాథాశ్రమాలకు ఒక్కో ఆశ్రమానికి రూ. 2 లక్షలు చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు విరాళంగా అందించాడు. ఈ మేరకు సోహెల్ వారికి చెక్కులు అందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సోహెల్ ( Sohel ) మాట్లాడుతూ.. ఇకపై కూడా తన సంపాదనలో 10 - 15 శాతం మొత్తాన్ని నిరుపేదలకు సేవ చేయడానికే వెచ్చిస్తానని ప్రకటించాడు. తనకు సాధ్యమైనంత మేరలో పేదలకు సేవ చేస్తూనే ఉంటానని సోహెల్ తెలిపాడు. 


Also read : Uppena teaser: ఆకట్టుకుంటున్న ఉప్పెన మూవీ టీజర్


ఇక సోహెల్ సినిమాల విషయానికొస్తే.. బిగ్ బాస్ ఇచ్చిన ఫేమ్‌తో రెండు సినిమాలకు సైన్ చేసిన సోహెల్ ( Bigg Boss contestant Sohel ).. త్వరలోనే ఆ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టనున్నాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook