Maanas Engagement Pics viral: ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌, సీరియల్‌ నటుడు మానస్‌ (Maanas) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. సెప్టెంబర్ 2 శనివారం నాడు శ్రీజ నిశ్శంకరతో ఆయన నిశ్చితార్థం హైదరాబాద్‍లోని ఓ ఫంక్షన్ హాల్‍లో చాలా వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బుల్లితెర తారలు సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్  చెబుతున్నారు. ఈ ఎంగేజ్‍మెంట్ కు హీరో సన్నీ, ఆర్జే కాజల్, కోయిలమ్మ సీరియల్ హీరోయిన్ తేజస్విని తదితరులు హాజరయ్యారు.  అయితే పెళ్లి ఎప్పుడనే సమాచారం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మానస్ బిగ్ బాస్, సీరియల్స్, టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తో మరింతగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియతో మానస్ చేసిన జరి జరి పంచెకట్టు వీడియో సాంగ్ అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది.  ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‍లో మెయిన్ హీరోగా నటిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు.  ఇందులో రాజ్ అనే పాత్రతో మానస్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. కెరీర్ పరంగా దూసుకుపోతున్న మానస్ తాజాగా జీవితంలో పెళ్లి వైపుకు తొలి అడుగు వేసి సడెన్ సర్‍ప్రైజ్ ఇచ్చాడు. అయితే పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు తప్ప ఆమె గురించి మిగతా విషయాలు ఏమీ తెలియరాలేదు. 



Also Read: Jailer Movie: ఓటీటీలో విడుదల కానున్న జైలర్ సినిమా, ఎప్పుడు ఎందులోనంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook