Jailer Movie: ఓటీటీలో విడుదల కానున్న జైలర్ సినిమా, ఎప్పుడు ఎందులోనంటే

Jailer Movie: ఇటీవల బాక్సాఫీసును కొల్లగొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ కలెక్షన్లు ఇంకా వసూలు చేస్తూనే ఉంది. మరోవైపు ఓటీటీ విడుదలకు కూడా సిద్ధమైపోయింది. ఎప్పుడు, ఎందులో అనే వివరాలు తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2023, 12:15 PM IST
Jailer Movie: ఓటీటీలో విడుదల కానున్న జైలర్ సినిమా, ఎప్పుడు ఎందులోనంటే

Jailer Movie: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అప్పుడే ఓటీటీ విడుదల తేదీ ఖాయం చేసుకుంది. జైలర్ సినిమా గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సినిమా జైలర్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా జైలర్ సినిమా 600 కోట్లు వసూలు చేసింది. గత కొద్దికాలంగో వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడిన రజినీ కాంత్‌కు జైలర్ సూపర్ హిట్ కావడం అద్భుతమైన విజయం. అదిరిపోయే హిట్ కోసం ఎదురుచూస్తున్న తలైవా అభిమానులకు తనివి తీరే విజయం సొంతం చేసుకుంది జైలర్ సినిమా.  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, తమన్నా, మీర్జా మీనన్, రమ్యకృష్ణ, కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ఇలా ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది. విడుదలై నెలరోజులు కాకుండానే 600 కోట్ల కలెక్షన్ దాటేసింది. కొన్ని చోట్ల ఇంకా హౌస్‌ఫుల్ అవుతూందని సమాచారం.

ఇప్పుడీ సినిమా ఓటీటీ విడుదల తేదీ వెల్లడైంది.సెప్టెంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జైలర్ సినిమా విడుదల కానుంది. వాస్తవానికి థియేటర్ రిలీక్ అయిన 4 వారాల తరువాత ఓటీటీలో విడుదల కావల్సి ఉంది. కానీ జైలర్ సినిమా పైరసీ అవడంతో సెప్టెంబర్ 7వ తేదీనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ హిట్ సాధించడంతో రజినీకాంత్ ఈ సినిమాకు 200 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి మరో ఐదు రోజుల్లో బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ ఓటీటీలో విడుదల కానుండటంతో రజినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఛాన్స్.. ఇలా చేస్తే లైవ్ లో షో చూడొచ్చు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News