Bigg Boss Samrat New Car : బిగ్ బాస్ రెండో సీజన్‌లో సామ్రాట్ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అంతకు ముందు సినిమాల ద్వారా సామ్రాట్ ఫేమస్ అయినా కూడా బిగ్ బాస్ షోతో ప్రతీ ఇంటికి చేరుకున్నాడు. సామ్రాట్ వేసిన సాఫ్ట్ రోల్స్, నెగెటివ్ కారెక్టర్లు, సైడ్ పాత్రలు అన్నీ కూడా అంతగా గుర్తింపును ఇవ్వలేదు. కానీ బిగ్ బాస్ షో మాత్రం సామ్రాట్‌కు మంచి ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. బిగ్ బాస్ రెండో సీజన్లో సామ్రాట్‌కు పాజిటివ్ ఇమేజ్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనీష్‌, దీప్తి, తేజస్వీ, సామ్రాట్‌లు ఒక గ్యాంగ్‌లా ఉండేవారు. మధ్యలో తేజస్వీ, సామ్రాట్‌లకు లింక్ కలిపారు. కానీ తమది జస్ట్ ఫ్రెండ్‌ షిప్ మాత్రమేనని తేజస్వీ క్లారిటీ ఇచ్చింది. ఇక సామ్రాట్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో మొదటి పెళ్లికి సంబంధించిన కాంట్రవర్సీ వచ్చింది. మొదటి భార్య చేసిన గొడవలు, విడాకుల కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే.


ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సామ్రాట్‌కు అవకాశాలు ఎక్కువగా రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ పెరిగింది. ఇక సామ్రాట్ రెండో పెళ్లికి సంబంధించిన విషయాలు కరోనా సమయంలో బాగానే ట్రెండ్ అయ్యాయి. సామ్రాట్ రెండో పెళ్లి కరోనా సెకండ్ వేవ్ సమయంలో జరిగిన సంగతి తెలిసిందే.


 



అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో రాజమండ్రిలో సామ్రాట్ పెళ్లి జరిగింది. హైద్రాబాద్‌లో తన మిత్రులు, సెలెబ్రిటీలకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చాడు. లిఖిత, సామ్రాట్‌ల జోడికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంటాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా ఈటీవీ షోలోకి వచ్చారు. లేడిస్ అండ్ జెంటిల్మెన్ అంటూ సాగే ఈ షోలో ఈ జోడి సందడి చేస్తోంది.


తాజాగా సామ్రాట్ కొత్త కారు కొన్నాడు. xuv700 కారుని కొన్నట్టుగా సామ్రాట్ తెలిపాడు. ఈ కారు ధర గరిష్టంగా పదిహేను లక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది చిన్న అచ్చీవ్మెంట్ అని.. ఇంకా మున్ముందు పెద్దదే కొంటాను అన్నట్టుగా చెప్పుకొచ్చాడు సామ్రాట్.


Also Read : Nikhil 18 Pages : కొంచెం టైం ఇవ్వు.. నిఖిల్‌ను వేడుకున్న హీరో శింబు


Also Read : Bandla Ganesh Politics : అంత గొప్పవాన్ని కాదు.. ఆ స్థాయి లేదు.. రాజకీయాలతో ఎంతో నష్టపోయాను.. బండ్ల గణేష్ ట్వీట్లు వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook