Singer Revanth Blessed With Baby Girl : బిగ్ బాస్ ఇంట్లోకి రేవంత్ వచ్చే ముందే తన భార్య అన్విత గురించి చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉందని, ఆమెను వదిలి రావడం ఇష్టం లేదని అన్నాడు రేవంత్. కానీ తనే నాకు ధైర్యం చెప్పి పంపించింది అంటూ తన భార్య గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ఇక స్టేజ్ మీదే తన భార్యను చూపించి రేవంత్‌కు సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. పుట్టబోయే బిడ్డను గర్భంలోంచి ముద్దాడిన రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. బిడ్డ పుట్టాకే తాను బయటకు వస్తాను అన్నట్టుగా రేవంత్ చెప్పాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇప్పుడు రేవంత్‌కు పండంటి బిడ్డ పుట్టింది. అన్విత ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. పండంటి ఆడ బిడ్డ పుట్టిందని, ఒకటో తేదీనే పాప పుట్టిందని చెప్పుకొచ్చింది అన్విత. దీంతో రేవంత్ అభిమానులు మురిసిపోతోన్నారు. కంగ్రాట్స్ రేవంత్, అన్విత అంటూ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అయినంతగా సంబరపడిపోతోన్నారు ఫ్యాన్స్.


అయితే బిగ్ బాస్ ఆరో సీజన్ విన్నర్ అయ్యేందుకు రేవంత్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి. కానీ ఆ అవకాశాలను తగ్గించే చాన్స్ మాత్రం ఆడియెన్స్‌కు రేవంత్ ఇస్తుంటాడు. తన కోపంలో మాట్లాడే మాటలు తనకే చేటు చేస్తున్నాయని తెలుసుకోలేకపోతోన్నాడు. కోపంలో ఏం మాట్లాడుతున్నాడు.. ఎలా మాట్లాడుతున్నాడు? అనేది కంట్రోల్‌లో పెట్టుకుంటే.. బిగ్ బాస్ విన్నర్     అవ్వడం మాత్రం పక్కా. ఇప్పటికీ రేవంత్‌కే బిగ్ బాస్ టైటిల్ కొట్టే చాన్సులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. తనకు బిడ్డ పుట్టిందని రేవంత్‌కు బిగ్ బాస్ చెబుతాడా? లేదా? అన్నది చూడాలి.
 


Also Read : Matti Kusthi Telugu Movie Review : మట్టి కుస్తీ రివ్యూ.. సరదాగా సాగే భార్యాభర్తల పోటీ


Also Read : HIT 2 Twitter Review : హిట్‌ 2 ట్విట్టర్ రివ్యూ.. కచ్చితంగా హిట్టే.. ట్విస్ట్ రివీల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook