రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) హౌస్ నుంచి ఏడో వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరు? అనే దానిపై ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ వర్గాలలోనూ ఆసక్తిని పెంచుతోంది. గత సీజన్ల తరహాలోనే బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌ (Bigg Boss Telugu 4)లోనూ కొందరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే అర్హత ఉన్నప్పటికీ, ఓట్లు ఎక్కువ సాధించినా కొందరు కంటెస్టెంట్స్‌ను తమ టీఆర్పీ కోసం ఇంటి నుంచి ఎలిమినేట్ చేసి పంపించేశారని ప్రేక్షకులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 6వ వారం కుమార్ సాయి ఎలిమినేషన్, అంతకుముందు నాలుగో వారం స్వాతి దీక్షిత్, మూడో వారం దేవి నాగవల్లి ఎమినేషన్ ప్రాసెస్ సైతం గందరగోళంలా తయారైంది. 6వ వారం ఎలిమినేసన్‌ గండం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్న మొనాల్ గజ్జర్ 7వ వారం ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. ఆమెకు తప్ప.. మిగతా కంటెస్టెంట్స్‌కు భారీగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి 7వ వారం నటి దివి ఎలిమినేట్ అయిపోయింది. గత సీజన్లలాగే ఈ సీజన్‌లో కొన్ని విషయాలు అలా తెలిసిపోతుంటాయి.



బిగ్‌బాస్ తెలుగు 4 ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. తన తాజా ఇంటర్వ్యూ కూడా పూర్తయిందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అందులో గత 6 వారాలపాటు ఎలమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో పాటు దివి ఫొటో గోడకు కనిపించింది. ఇక సందేహం ఏముంది. రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఫేస్‌బుక్ పోస్టుతో వెనుక ఫ్రేమ్‌లో దివి ఫొటో కనిపించడంతో.. అయ్యో... స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లలో ఒకరైన దివి ఎలిమినేట్ అయ్యిందా అంటూ ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఈ రోజు రాత్రి దీనిపై స్పష్టత రానుంది.



[[{"fid":"195786","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Divi Eliminated From Bigg Boss Telugu 4 (Image Credit: Facebook)","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Divi Eliminated From Bigg Boss Telugu 4 (Image Credit: Facebook)","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Divi Eliminated From Bigg Boss Telugu 4 (Image Credit: Facebook)","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


 


కాగా, నేడు విజయదశమిని పురస్కరించుకుని బిగ్‌బాస్ 4 హౌస్‌లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. స్టార్ మా ఇదివరకే కొన్ని ప్రోమోలు విడుదల చేయగా.. దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు బిగ్‌బాస్ తెలుగు 4 హోస్ట్‌గా సమంత అక్కినేని కొత్త అవతారం ఎత్తారు. అయితే పండుగ ఎపిసోడ్ రోజే, 7వ వారం ఎలిమినేషన్ సైతం ఉండటంతో సమంత వ్యాఖ్యాతగా ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలని బిగ్‌బాస్ 4 ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ఈరోజు సాయంత్రం 6 గంటలకే బిగ్‌బాస్ 4 ఎసిపోడ్ ప్రారంభం కానుంది.  Photo Gallery: Bigg Boss Telugu 4: బ్యూటిఫుల్ దివి ఫొటోస్ ట్రెండింగ్



 


 


Aaj ka interview ab khatam😉

Posted by Rahul Sipligunj on Saturday, October 24, 2020

 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe