Monal Gajjar Bigg Boss 4 Contestant: మొనాల్ గజ్జర్‌కు హ్యాండ్ ఇచ్చిన అఖిల్! ఈ వారం అయోమయం?

మొనాల్ గజ్జర్ (Monal Gajjar Bigg Boss Voting Number)ను బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి ఇప్పట్లో పంపరని షో చూస్తున్న ప్రేక్షకులకు అర్థమైంది. నువ్వు ఇప్పటివరకూ తొలి రౌండ్‌లో ఉండిపోయావని’ అఖిల్ అన్నాడు. మరో మాట మాట్లాడకుండా తాను నామినేట్ అవుతున్నట్లు మొనాల్ ఒప్పుకుంది. 

Last Updated : Oct 20, 2020, 02:53 PM IST
Monal Gajjar Bigg Boss 4 Contestant: మొనాల్ గజ్జర్‌కు హ్యాండ్ ఇచ్చిన అఖిల్! ఈ వారం అయోమయం?

రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)వ సీజన్‌ ఏడో వారానికి చేరుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడిగా భావించిన వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ కుమార్ సాయి అనూహ్యంగా ఆరో వారం ఎలిమినేట్ అయ్యాడు. దీంతో మొనాల్ గజ్జర్ (Akhil nominates Monal Gajjar for 7th week Elimination)ను బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి ఇప్పట్లో పంపరని షో చూస్తున్న ప్రేక్షకులకు అర్థమైంది. ఈ క్రమంలో సోమవారం నాడు బిగ్‌బాస్ 4 తెలుగు 7వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియ ‘రంగు పడుద్ది’ జరిగింది. జంటలు జంటలుగా చేసి నామినేషన్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు బిగ్‌బాస్.

మొదట అఖిల్, మొనాల్ గజ్జర్‌లను జోడీగా విడగొట్టాడు బిగ్‌బాస్. ఆపై వీరిద్దరిలో ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి నామినేట్ అవుతారో తేల్చు్కోవాలని బిగ్‌బాస్ సూచించాడు. నామినేట్ అయిన వారి పేరు చెప్పి పైన ఉన్న బకెట్‌లోని రంగును నామినేటెడ్ కంటెస్టెంట్ మీద వేయాలని ఆదేశించాడు. ‘నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను, అన్ని టాస్కులు బాగా ఆడాను. చాలా టాస్కులలో నేను రౌండో రౌండ్ చేరుకున్నాను. నువ్వు ఇప్పటివరకూ తొలి రౌండ్‌లో ఉండిపోయావని’ అఖిల్ అన్నాడు. మరో మాట మాట్లాడకుండా తాను నామినేట్ అవుతున్నట్లు మొనాల్ ఒప్పుకుంది. 

తన స్నేహితుడు అఖిల్ కోసం ఏం వాదించకుండానే మొనాల్ నామినేషన్‌కు ఒకే చేయడం సంగతి అటుంచితే.. ఇదేంటి అఖిల్ నిన్ను నమ్ముకుంటే నువ్వే నామినేట్ చేశావని బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. గత వారమే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయేలా కనిపించగానే చివర్లో ఏడ్చేశాడు. ఇప్పుడు నామినేషన్‌లోకి వెళ్తే ఆమె ఔట్ అనే విషయాన్ని పట్టించుకోలేదా.. లేక ఏం జరిగినా సరే రొమాన్స్ ట్రాక్ కోసమైనా మొనాల్‌ను బిగ్‌బాస్ సేవ్ చేస్తాడని భావించాడా అని పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   మొనాల్ బిగ్‌బాస్ ఓటింగ్ నెంబర్ - 8886658201

తాను రోజురోజుకూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారినట్లు కనీసం మొనాల్ మాట కూడా చెప్పలేదు. అఖిల్‌ను గుడ్డిగా నమ్మడం అటుంచితే.. తన కోసం ఏం చేశాడని, కనీసం ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వలేవా అని మొనాల్ నోరు తెరిచి అడగకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అఖిల్ కూడా కెప్టెన్ కాలేదని, అలాంటప్పుడు ఇద్దరు సమానమేనని అర్థమవుతోంది.  మరోవైపు నామినేషన్లకు వెళ్లినా ప్రేక్షకులు తనకు ఓట్లు వేస్తారని, హౌస్‌లో జరిగే విషయాలను వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారని భావించడం సరికాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అఖిల్ మాత్రం మొనాల్ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆమెకు అండగా ఉన్నానని చెప్పుకుంటూ చివరికి ఛాన్స్ దొరికింది కదా అని ఆమెకే ఎసరుపెట్టేశాడు.  

గత వారం తప్పించుకున్నా.. ఈ ఆదివారం మొనాల్ ఎలిమినేషన్ ఉంటుందని.. తమ ఓట్లు నిజమైతే అదే జరుగుతుందని టాక్ వినిపిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News