Bigg Boss Telugu 5 latest Promo: తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 5(Bigg Boss 5 Telugu) రోజురోజూకు ఆసక్తిని రేపుతోంది. బిగ్ బాస్(Bigg Boss) ఇచ్చే టాస్క్ లు కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీంతో వారు ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకోవడం..వాదనలకు దిగడం చేస్తున్నారు. నిన్న సిరి-సన్నీ, షన్నూ-సన్నీ ల మధ్య పెద్ద గొడవే జరిగింది. వీటన్నింటిపైన ఈ రోజు నాగార్జున(Nagarjuna) పంచాయతీ షురూ కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం ఎపిసోడ్(Episode)కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు నిర్వాహకులు. కెప్టెన్‌ అయిన రవి పోలీస్‌ క్యాప్‌ ధరించి సన్నీ(Sunny)ని జైలులో వేశాడు. ‘బ్యాడ్‌ బిహేవియర్‌.. లూజ్‌ టంగ్‌.. ఇష్టమొచ్చింది మాట్లాడతా.. ఇష్టం వచ్చింది చేస్తా అంటాడు. నా వరకూ చాలా తప్పు అనిపిస్తోంది సర్‌’ అని సన్నీ(VJ Sunny)పై రవి(Anchor Ravi) ఆరోపణలు చేశాడు. ‘తంతా’ అనే పదం సన్నీ వాడాడని రవి అనగా, ‘లేదు సర్‌’ అని సన్నీ సమాధానం ఇచ్చాడు. దీంతో నాగార్జున ఆ వీడియో(Video)ను ప్లే చేయడంతో సన్నీ బిక్క మోహం వేశాడు. 


Also read: Shocking News about Sudhir:జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ అండ్ టీమ్..??


నిన్నే అమ్మేస్తానని ఎవర్ని అన్నావని నాగార్జున నిలదీయగా.. ఆ మాట అనలేదన్నాడు సన్నీ. దీంతో యానీ మధ్యలో కలగజేసుకుంటూ అతడు కోపంలో ఏదో అనేస్తాడు, కానీ సిరిని అమ్మేస్తాననలేదని చెప్పింది. ‘కోపంలో ఏదైనా అంటాడా. అయితే, కాజల్‌(RJ Kajal)పై నువ్వు అన్నమాట కూడా సరైనదేనా’ అని నాగార్జున అనేసరికి అనీ మాస్టర్‌ షాక్ కు గురైంది. నాగార్జున ఇంకా ఎవరెవరికి క్లాస్ పీకాడో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook