Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5(Bigg Boss 5 Telugu)’తుది దశకు చేరుకుంది. మరోవారంలో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఆఖరి ఫన్‌డేలో భాగంగా... నాగార్జున(Nagarjuna).. ఆరుగురి ఇంటి సభ్యులతో సరదాగా ఆటలు ఆడించినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇందులో కంటెస్టెంట్స్‌ అందరికీ కొన్ని చిటీలు ఇచ్చి.. అందులో ఉన్న పాటను సైగలు చేసి ఇతర ఇంటిసభ్యులకు తెలియజేయాలని కోరారు. ఈ గేమ్‌లో సన్నీ, మానస్‌, షణ్ముఖ్‌.. సైగల ద్వారా చెప్పడానికి తెగ ఇబ్బందిపడగా.. సిరి సునాయాసంగా గెలిచినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లపై ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో..బిగ్‌బాస్‌(Bigg Boss)షో నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు ఈ ఆరుగురికి ప్రశ్నలు సంధించనున్నట్లు మరో ప్రోమో చూస్తే అర్థమవుతోంది. షణ్ముఖ్‌, సిరిల బంధంపై జెస్సీ(Jaswanth) ఘాటు ప్రశ్నలు అడిగాడు. 



Also Read: Bigg Boss Guest: ఈ వీకెండ్ బిగ్‌బాస్ హౌస్‌కి ఊహించని అతిథి... ఎవరో తెలుసా...


'షణ్నూ ఇది చాలా సీరియస్‌.. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్‌ ఉందో, జనాలు ఏం అనుకుంటున్నారో? అని ఎప్పుడైనా ఆలోచించావా?' అని సూటిగా ప్రశ్నించాడు జెస్సీ. 'నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి గేమ్‌ ఆడటానికి వెళ్లావు కదా సిరి, కానీ ఎమోషనల్‌ కనెక్ట్‌ అయిపోతున్నాను అదీ ఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, అవసరమా నీకు' అని సిరి(Siri)కి గట్టి క్లాస్ పీకాడు జెస్సీ. ‘హౌస్‌లో నన్ను భరించావా? నటించావా’ అని మానస్‌ను ప్రియాంక అడిగింది. ఇప్పటికే  శ్రీరామ్, సన్నీలు ఫైనలిస్టులుగా ఎంపికయ్యారు. ఈ వారం ఎవరు టాప్-5లో నిలుస్తారో? ఎవరు ఎలిమినేట్ అవుతారో? తెలియాలంటే నేటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి