Bigg Boss Guest: ఈ వీకెండ్ బిగ్‌బాస్ హౌస్‌కి ఊహించని అతిథి... ఎవరో తెలుసా...

Bigg Boss Show Weekend Guest: బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వీకెండ్ ఊహించని అతిథి సందడి చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా సినీ సెలబ్రిటీలే గెస్టులుగా వచ్చే ఈ షోకి... తొలిసారి ఓ రాజకీయ నాయకుడు గెస్ట్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు...  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 12:07 PM IST
  • ఈ వీకెండ్ బిగ్‌బాస్ గెస్ట్‌గా టీఆర్ఎస్ ఎంపీ
  • ఎంపీ జోగినిపల్లి సంతోష్ గెస్ట్‌గా రానున్నట్లు ప్రచారం
  • బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ముచ్చటించనున్న ఎంపీ
Bigg Boss Guest: ఈ వీకెండ్ బిగ్‌బాస్ హౌస్‌కి ఊహించని అతిథి... ఎవరో తెలుసా...

Bigg Boss Show Weekend Guest: బిగ్‌బాస్ వీకెండ్ షోకి (Bigg Boss 5) ఊహించని గెస్ట్ రాబోతున్నారా... రొటీన్‌కు భిన్నంగా ఈసారి ప్రముఖ పొలిటీషియన్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారా... ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎంపీ హోదాలో ఉన్న ఓ నాయకుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నాయకుడు అనుకుంటున్నారా... ఆయనే టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ (Joginipally Santosh Kumar)...

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో (Green India Challenge) దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ లేటెస్ట్ వీకెండ్ షోలో ఆయన గెస్ట్‌గా అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రతీ వీకెండ్‌లో ఓ గెస్ట్ వచ్చి సందడి చేస్తుంటారు. ఎక్కువగా సినీ సెలబ్రిటీలే గెస్ట్‌గా రావడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఎంపీ సంతోష్ కుమార్‌ను గెస్ట్‌గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆదివారం (డిసెంబర్ 12) నాటి బిగ్‌బాస్ షోకి గెస్ట్‌గా విచ్చేయనున్న ఆయన కంటెస్టెంట్లతో ముచ్చటించనున్నట్లు సమాచారం.

ఎంపీ సంతోష్ కుమార్ (TRS) అటు రాజకీయ నాయకుడి గానే కాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో ప్రకృతి ప్రేమికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంపీ పిలుపు మేరకు ఇప్పటివరకూ ఎంతోమంది సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. దాదాపు నాలుగేళ్లుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పలు అవార్డులు, రికార్డులను సైతం సొంతం చేసుకుంది.

Also Read: HBD Rajinikanth: నేడు తలైవా రజనీకాంత్ పుట్టినరోజు-ట్విట్టర్‌లో పోటెత్తుతున్న విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News