BB 7 Telugu Elimination: నాలుగో వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ లో వారిద్దరూ..!
Bigg Boss 7 Telugu: ముందుగానే చెప్పినట్లు బిగ్ బాస్ సీజన్ 07 ఉల్టా పుల్టాగా సాగుతోంది. ప్రశాంత్ నాలుగో హౌస్ మేట్ గా ఎంపికయ్యాడు. మరోవైపు ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
BB 7 Telugu 4th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 ఊహించని ట్విస్టులతో దూసుకుపోతుంది. నాగార్జున ముందుగానే చెప్పినట్టు ఉల్టా పుల్టాగా సాగుతోంది. తొలుత ఈ హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా.. ఇప్పుడు 11 మంది మాత్రమే మిగిలారు. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా, మూడో వారం సింగర్ దామిని భట్ల ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ వారం ఎవరూ బయటకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జరిగిన టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచి నాలుగో ఇంటి సభ్యుడయ్యాడు. దీంతో అతడికి రెండు వారాల ఇమ్యూనిటీ లభించింది. ఇప్పటికే శివాజీ, సందీప్, శోభా శెట్టి హౌస్ మేట్స్ అయిన సంగతి తెలిసిందే.
నాలుగో వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. వారే గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, ప్రియాంక జైన్, శుభ శ్రీ. ఓటింగ్ లో ఊహించని కంటెస్టెంట్స్ టాప్ లోకి దూసుకొచ్చారు. ఈ ఓటింగ్ పోల్‍లో 26.29 శాతంతో ప్రిన్స్ యావర్ మొదటి స్థానం, 16.86 శాతంతో రెండో స్థానంలో గౌతమ్, 16.51 శాతం ఓట్లతో శుభ మూడో స్థానంలో, 15.92 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ప్రియంక ఉన్నారు. చివరి స్థానాల్లో 13.64 శాతంతో టేస్టీ తేజ, 10.78 శాతంతో రతిక రోజ్ ఉన్నారు.
మెున్నటి వరకు చివరి స్థానంలో ఉన్న తేజ.. ఓటింగ్ ముగిసేసరికి ఒక స్థానం ముందుకు వచ్చాడు. అయితే స్మైలీ టాస్క్ లో గౌతమ్‌ను తేజ ఫిజికల్ అటాక్ చేయడంతో అతనికి రెడ్ కార్డు చూపించి హౌస్ నుంచి పంపించేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే తేజతోపాటు రతిక కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: BB 7 Telugu Updates: బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేది వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook