Bigg Boss Telugu OTT Bold Beauties: హౌస్ అంతా బోల్డ్ బ్యూటీలే, రేటింగ్ కోసం గ్లామర్ షోకు సిద్ధమే
Bigg Boss Telugu OTT Bold Beauties: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభమైంది. రేటింగ్ కోసం బిగ్‌బాస్ కొత్త వ్యూహం పన్నాడు. గ్లామర్ షోకు వెనుకంజేయని బోల్డ్ బ్యూటీలతో హౌస్ నింపేశాడు.
Bigg Boss Telugu OTT Bold Beauties: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభమైంది. రేటింగ్ కోసం బిగ్‌బాస్ కొత్త వ్యూహం పన్నాడు. గ్లామర్ షోకు వెనుకంజేయని బోల్డ్ బ్యూటీలతో హౌస్ నింపేశాడు.
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ. 17 మంది పాత, కొత్త కంటెస్టెంట్లతో జోరుగా సాగుతోంది. ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్‌గా బిగ్‌బాస్ రేపిన చిత్తు కొనసాగుతోంది. ఫిబ్రవరి 26వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఈ షోలో అప్పుడే గొడవలు ప్రారంభమయ్యాయి. ఏదైనా షోకు రేటింగ్ రావాలంటే వివాదాస్పదంగా లేదా హాట్‌హాట్‌గా లేదా బోల్డ్‌గా ఉండాలనే నియమాన్ని బిగ్‌బాస్ పాటిస్తున్నట్టు కన్పిస్తోంది. వివాదం కోసం ఇరువురి మధ్య ఛాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ అంటూ పోటీ పెట్టేశాడు. ఫలితంగా శ్రీ రాపాక వర్సెస్ అరియానా వివాదం చెలరేగుతోంది.
మరోవైపు హాట్‌హాట్‌గా ఉండేందుకు హౌస్ అంతా బోల్డ్ బ్యూటీలతో నింపేశాడు.17 మంది కంటెస్టెంట్లలో 9 మంది మహిళలు కాగా అందులో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా గ్లామర్ షోకు వెనుకంజ వేయనివారే. హౌస్ అంతా ఫుల్ కలరింగ్‌తో నడుస్తోంది. వర్మ థియేటర్ నుంచి రిలీజైన బోల్డ్ బ్యూటీలు అషురెడ్డి, శ్రీ రాపాకతో పాటు ముమైత్ ఖాన్, సరయు, మిత్రా శర్మ, తేజస్వి ముదివాడ, హమీదా, స్రవంతి, బిందు మాధవి, అరియానా గ్లోరీలు ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు తప్ప అందరూ బోల్డ్ బ్యూటీలే. అందాల ఆరబోతకు సిద్ఘంగా ఉండి పోటీ పడేవారే. ఇందులో స్రవంతి, ముమైత్ ఖాన్, అషురెడ్డి, అరియానా గ్లోరీ, మిత్ర శర్మ, శ్రీ రాపాక, అషురెడ్డి, హమీదాలు ఎప్పుడూ బోల్డ్ షోకు సిద్ధంగా ఉంటారు. అవసరమైనంత గ్లామర్ వెదజల్లుతూ ఉంటారు. ఒక్క బిందు మాధవి మాత్రమే కాస్త పద్ధతిగా ఉంటుందని అన్పిస్తోంది. అసలే బోల్డ్ బ్యూటీలు..ఇక బిగ్‌బాస్ ఓకే అంటే ఇక రెచ్చిపోవడమే తరువాయి. రేటింగ్ కోసం వివాదం లేదా హాట్‌నెస్ రెండింటిలో ఏదో ఒకటి కచ్చితంగా పాటించడం బిగ్‌బాస్‌కు అలవాటే మరి.
Also read: Payal Rajput Photos: స్విమ్మింగ్ ఫూల్ వద్ద మెస్మరేజ్ చేస్తోన్న పాయల్ రాజ్ పుత్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook