Siri Remuneration: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగిసింది. గ్రాండ్ ఫినాలే...అత్యంత వైభవంగా ముగిసింది. టైటిల్ విన్నర్‌గా ఊహించినట్టే సన్నీ గెల్చుకున్నాడు. ఈ నేపధ్యంలో టాప్ 5లో ఉన్న ఏకైక మహిళ..సిరి పారితోషికంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఆర్భాటంగా , విభిన్న సెలెబ్రిటీల మధ్య ముగిసింది. ఊహించినట్టుగానే సన్నీ తొలిస్థానంలో నిలిచి..బిగ్‌బాస్ తెలుగు 5 టైటిల్ గెల్చుకున్నాడు. ఇక యూట్యూబర్ షణ్ముఖ్ రెండవ స్థానంలో నిలవగా..సింగర్ శ్రీరామచంద్ర మాత్రం మూడోస్థానానికి పరిమితమయ్యాడు. 


15 వారాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో(Bigg Boss Telugu Season 5) టాప్ 5 కంటెస్టెంట్లుగా మిగిలిన సన్నీ, షణ్ముక్, శ్రీరామచంద్ర, మానస్, సిరిలలో ముందుగా సిరి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆ తరువాత మానస్ హౌస్ నుంచి నిష్క్రమించాడు. బిగ్‌బాగ్ ఆఫర్ చేసిన భారీ నగదును టాప్ 3 కంటెస్టెంట్లు నిరాకరించారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా సన్నీ విజేతగా నిలవగా, షణ్ముఖ్ రన్నరప్‌గా నిలిచాడు. శ్రీరామచంద్ర మూడవస్థానానికి పరిమితమయ్యాడు. ముందుగా ఎలిమినేషన్ అయిన సిరి (Siri)మాత్రం టాప్ 5లో నిలిచిన ఏకైక మహిళా కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో పటాకాగా పేరు తెచ్చుకుంది. మగవారితో సమానంగా అన్నింట్లో పోరాడుతూ అభిమానుల్ని ఆకట్టుకుంది.


సిరి ఎలిమినేషన్ కారణాలు( Reasons for Sirir Elimination)


బిగ్‌బాస్‌లో(Bigg Boss) ఉన్న 15 వారాలు తన ఆట ఏంటో చూపించింది. అయితే షణ్ముఖ్ ప్రభావానికి లోనై కాస్త వ్యతిరేకత కొనితెచ్చుకుంది. షణ్ముఖ్‌కు అవసరానికి మించిన ప్రాధాన్యత ఇచ్చి..అతడు చెప్పినట్టు ఆడుతూ చివరి వారాల్లో వ్యక్తిగత సామర్ధ్యాన్ని కోల్పోయినట్టు తెలుస్తోంది. గేమ్ ప్రారంభంలో సిరికి ఉన్న ఆదరణ ఆ తరువాత క్రమంగా తగ్గడమే దీనికి కారణం. అదే సమయంలో షణ్ముఖ్‌కు ఆదరణ పెరగడం కూడా గమనించాలి. లేకపోతే సింగర్ శ్రీరామచంద్ర రన్నరప్‌గా నిలిచి ఉండేవాడు. సిరి చెబుతున్నట్టు హౌస్‌లో తనను అన్ని విధాలా సహకరించాడని చెప్పిన మాటల్లో అంతా నిజం కాదని ప్రేక్షకులకు తెలుసు. షణ్ముఖ్ (Shanmkukh)ప్రభావానికి లోనవడాన్ని సమర్ధించుకునేందుకు ఆమె అలా చెబుతుందని గ్రహించారు. ఓ విధంగా చెప్పాలంటే సిరి అభిమానుల్ని షణ్ముఖ్ పరోక్షంగా వినియోగించున్నాడనే వాదన విన్పిస్తోంది. ఇదే సిరి టాప్ 5లో చివరి స్థానంలో నిలవడానికి కారణమైంది. 


సిరి పారితోషికం వివరాలు(Siri Remuneration)


యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌తో పాటు చిన్న చిన్న సీరియల్స్‌లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సిరి బిగ్‌బాగ్ హౌస్‌లో(Bigg Boss House) 15 వారాలు కొనసాగింది. సిరికి వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ ఇచ్చేట్టుగా ముందుగానే డీల్ కుదిరింది. ఈ ప్రకారం సిరి 15 వారాలకు కలిపి దాదాపు 25 లక్షల వరకూ గెల్చుకుందని తెలుస్తోంది. ట్రోఫీ రాకపోయినా..విన్నర్ నగదు పారితోషికంలో దాదాపు సగం గెల్చుకున్నట్టే. 


Also read: Bigg Boss 5 Telugu Winner: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 విజేతగా సన్నీ..రెండో స్థానంలో షణ్ముఖ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook