BB 5 Telugu Winner: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5(Bigg Boss 5 Telugu ) విజేతగా సన్నీ(Sunny) అవతరించాడు. షణ్ముఖ్(Shanmukh) రెండో స్థానంలో నిలిచాడు. శ్రీరామచంద్ర మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫినాలే(Bigg Boss 5 Telugu Grand Finale) ఈవెంట్ గ్రాండ్ గా సాగింది. ముందుగా బ్రహ్మస్త్ర టీమ్ స్టేజిపై సందడి చేసింది. రణబీర్ కపూర్, అలియాభట్(Alia Bhatt) సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. జక్కన్న రాజమౌళి, బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ కూడా స్టేజ్ పై సందడి చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ ప్లే చేశారు. బిగ్‌బాస్ సీజన్-5లో ఎవరు విజేతగా నిలిచినా అందరూ తమ స్నేహాన్ని విడవకూడదని హౌస్‌మేట్స్‌కు సూచించారు బ్రహ్మస్త్ర టీమ్. టాప్ 5 కంటెస్టెంట్స్‌తో' బ్రహ్మాస్త్రం' గేమ్ ఆడించాడు నాగార్జున. మంచి సమాధానం చెప్పిన మానస్ కు రాజమౌళి తన బ్రహ్మస్తాన్ని ఇచ్చాడు.
సిరి ఔట్..
అనంతరం ఫుష్ప మూవీ(Pushpa Movie) టీమ్ స్టేజ్ పైకి వచ్చింది. రష్మిక మందన్నా(Rashmika Mandanna), డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ అలరించారు. హౌస్ లోపలికి వెళ్లిన రష్మిక, దేవీ తమ స్టెప్పులతో హౌస్ మేట్స్ చేత డ్యాన్స్ చేయించారు. తర్వాత ఫైనలిస్టుల ఫొటోలున్న డ్రోన్లను గాల్లోకి వదిలారు. ఇందులో సిరి(Siri)ఫొటో ఉన్న డ్రోన్ ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో సిరిని తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేశారు రష్మిక, దేవి శ్రీ ప్రసాద్.
మానస్ ఎలిమినేట్..
ఫినాలే సందర్భంగా శ్యామ్ సింగరాయ్ టీమ్ స్జేజీపైకి వచ్చింది. నాని, సాయిపల్లవి, కృతిశెట్టి హౌస్ లోకి వెళ్లారు. హౌస్ మేట్స్ తో డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా హౌస్‌లోకి వెళ్లిన వీళ్లు టాప్-4లో ఉన్న నలుగురికి డబ్బులు ఆఫర్ చేశారు. నలుగురూ తిరస్కరించారు. రెండోసారి కూడా ఆఫర్ ఇస్తానని నాగార్జున ప్రకటించినా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం జరిగిన ఎలిమినేషన్‌లో మానస్ ఎలిమినేట్ అయ్యాడు.
శ్రీరామచంద్ర ఎలిమినేట్
ఫినాలే స్టేజ్ పై నాగచైతన్య(Nagachaitanya) ‘'ప్రో కబడ్డీ’' ప్రచారం చేశారు. అనంతరం హౌస్‌లోకి వెళ్లి ముగ్గురు కంటెస్టెంట్‌లతో మాట్లాడారు. ఈ సందర్భంగా గోల్డెన్ బాక్సులో రూ.20లక్షలు ఆఫర్ చేశారు. ఆ డబ్బులు తీసుకోవడానికి ముగ్గురిలో ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం శ్రీరామ్(sri rama chandra) ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
సెప్టెంబర్ 5న ప్రారంభమైన ఈ రియాల్టీ షో.. నేటితో (డిసెంబర్ 19)తో ముగిసింది. కింగ్ నాగార్జున వరసగా మూడో సారి వ్యాఖ్యాతగా ఆకట్టుకున్నారు. మెుత్తం 19 మంది టైటిల్ కోసం పోటీపడగా..చివరకు సన్నీ విజేతగా నిలిచాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook