Bigg Boss Telugu 5 Nominations: బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన షో 'బిగ్‌బాస్‌' (Bigg Boss). 60 రోజులు పూర్తైన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 5 (Bigg Boss Telugu 5 )ని ఈ సారి కూడా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)హోస్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ షో ప్రారంభమైనప్పటి నుండి టీవీ ఛానల్ టీఆర్‌పి రేటింగ్ (TRP Rating)లో టాప్ రేంజ్ కు చేరుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'బిగ్‌బాస్‌'.. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా వారానికి ఒకరు బయటకి వెళ్తున్నారు. ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. సోమవారం రోజున నామినేషన్ ప్రక్రియ జరగనుంది. అయితే వారం అంత సరదాగా ఉన్న సభ్యులు అందరు... నామినేషన్ వచ్చిందంటే చాలు ఆ రోజు గొడవలు ఆకాశాన్ని అంటుతాయి. 


Also Read: Viral Video: ఈడు మగాడ్రా బుజ్జి.. 'పడగ విప్పిన పాముకు ముద్దు'.. వహ్!




మళ్లీ  ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే  పోయిన వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో (Captancy Task) గ్రూపులుగా విడిపోయిన సంగతి మనకు తెలిసిందే! ఈ రోజు జరగబోయే నామినేషన్ కోసం ఐస్ క్రీమ్ ఇచ్చి.. కారణం చెప్పి నామినేషన్ చేయాలనీ బిగ్‌బాస్‌ సూచించారు. 


ఎప్పటిలాగే ఈ సారి కూడా చాలా రసవత్తరంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగిందనే చెప్పాలి. ఎప్పటిలాగే శ్రీరామ్ (SriRam)వర్సెస్ మానస్ (Manas).. సన్నీ (Sunny) వర్సెస్ సిరిగా (Siri)మారింది. మొదటగా యాంకర్ రవి (Anchor Ravi) ఎప్పటి లాగే కాజల్ (Kajal) ను, మానస్ ను నామినేట్ చేసాడు. అనంతరం సిరి వచ్చి, సన్నీని హెల్త్ గురించిన కారణం చెప్పి నామినేట్ చేయగా.. అన్నీ మాస్టర్ ను కూడా సిరి నామినేషన్ చేసింది.


ఇక శ్రీరామ్ వచ్చి.. 5 గురు గ్రూపు ఎవ్వరు పేర్లు చెప్పాలంటూ అనగా.. "గుమ్మడికాయల దొంగ ఎవరంటే నువ్ ఎందుకు భుజాలు తడుముకుంటున్నావ్" అని అనటం.. "కాలేజ్ లలో జరిగే చైన్ బ్యాచ్ గొడవల్లా" ఉన్నాయి అంటూ శ్రీరామ్ తెలుపుతూ మానస్ ను నామినేట్ చేసాడు. ఇక ఐదుగురు ఎవరంటూ యాంకర్ రవి కూడా మానస్ ను నామినేట్ చేసాడు. 


Also Read: Bank Holidays in November: న‌వంబ‌ర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. ?


రసవత్తరంగా సాగిన నామినేషన్ ప్రక్రియలో ఎవరు ఈ వారం నామినేషన్ లోకి వచ్చారో తెలియాలంటే.. ఈ రోజు ఎపిసోడ్ వచ్చే వరకు చూడాల్సిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook