Bigg Boss OTT List: బిగ్‌బాస్ తెలుగు ఫీవర్ మళ్లీ ప్రారంభం కానుంది. మరో మూడు వారాల్లో ఆన్ స్క్రీన్ కానుంది. అయితే ఈసారి టీవీ తెరపై కాకుండా ఓటీటీ తెరపై బిగ్‌బాస్ సందడి ఉండనుంది. మరి ఈ సందడికి సిద్ధమైన వాళ్లెవరో తెలుసుకుందామా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుల్లితెర సాక్షిగా వివిధ రకాల రియాల్టీ షోలు జరుగుతుంటాయి. ఇండియన్ ఐడల్ కావచ్చు, సరిగమప కావచ్చు, ఢీ కావచ్చు, డ్యాన్స్ డ్యాన్స్ కావచ్చు, ఖత్రోంకి ఖిలాడి కావచ్చు ఇలా ప్రతి షో ఓ ప్రత్యేకం. ఇక అన్నింటికంటే అత్యధిక ప్రజాదరణ కలిగిన షో బిగ్‌బాస్ షో. ఇంచుమించు అన్ని భాషల్లో కూడా బిగ్‌బాస్ ఒక హిట్ షోగా నిలుస్తోంది. బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అటువంటిది. ( Bigg Boss Telugu to stream on Hotstar OTT platform from february 20th, here is the contestants list )


బిగ్‌బాస్ తెలుగు ఇప్పుడు మరో కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది. 2017లో మొదటి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 2021 వరకూ ఐదు సీజన్‌లు జరిగాయి. అన్ని సీజన్లకు భారీగానే ఆదరణ లభించింది. ఒకసారి నాని, మరోసారి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా..మూడుసార్లు నాగార్జున హోస్ట్ చేశాడు. ఈసారి బిగ్‌బాస్ తెలుగు..హిందీలానే ఓటీటీ తెరపై స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. బిగ్‌బాస్ ఒక సీజన్‌కు మరో సీజన్‌కు సాధారణంగా అయితే కనీసం ఆరు నెలలు ఆగాల్సిన పరిస్థితి. అయితే డిసెంబర్‌లో ముగిసిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే వేదిక నుంచి త్వరలో నెక్స్ట్ సీజన్ అంటూ ప్రకటించాడు నాగార్జున. ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అంటే మరో మూడు వారాల్లోనే బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. మరి ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేసేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారనేది ఆసక్తి కల్గిస్తోంది. 


ఈసారి బిగ్‌బాస్ ఓటీటీలో మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగా అరియానా, ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ పేర్లు విన్పిస్తున్నాయి. మరోవైపు కొత్తవారి జాబితాలో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ఢీ 10 విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ వెబ్‌సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగర్ వందన, యాంకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అయితే కంటెస్టెంట్ల విషయంలో బిగ్‌బాస్ నుంచి ఏ విధమైన అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కేవలం ఊహాగానాలే విన్పిస్తున్నాయి. అటు మాజీ కంటెస్టెంట్ల విషయం కూడా నిర్ధారణ కాలేదు. వార్తలు మాత్రం హల్‌చల్ చేస్తున్నాయి.


Also read: Sirivennela Last Song: మరణం గురించి ఆ పాటలో సిరివెన్నెల ముందే ఎలా రాసుకున్నారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook