Himaja Divorce: గ్లామర్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడాకుల పర్వం నడుస్తోంది. ఊహించని పెద్ద కారణాల్లేకుండానే విడిపోతున్నారు. ఇప్పుడు మరో జంట విడిపోతోంది. బాలీవుడ్ ఫేమ్‌గా ప్రాచుర్యం సంపాదించిన ఆ నటి విడాకులకు సిద్దమైందట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా పరిశ్రమలో విడాకులు సర్వ సాధారణంగా మారిపోయాయి. మొన్న నాగ చైతన్య-సమంతలు విడాకులు తీసుకుంటే..నిన్న ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నారు. అంతకముందు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్-కిరణ్‌రావులు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో నటి విడాకులకు సిద్దమైంది. 


బిగ్‌బాస్ రియాలిటీ షోతో(Bigg Boss Reality Show) పాపులారిటీ సంపాదించుకున్న నటి హిమజ...ఇటీవల తన భర్తను ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్ నుంచి అన్‌ఫాలో చేసింది. అటు హిమజ భర్త కూడా ఈమెను అన్‌ఫాలో చేసేశాడు. ఇరువురూ విడాకులు తీసుకోవడం వల్లనే ఒకరికొకరు అన్‌ఫాలో చేసుకున్నరని తెలుస్తోంది. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎందుకంటే హిమజకు పెళ్లైన సంగతి చాలామందికి తెలియదు. అటు హిమజ కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పలేదు. వాస్తవానికి 2021లోనే రాజేష్ ఆనంద్ అనే వ్యాపారవేత్తతో హిమజ పెళ్లైంది.కానీ రహస్యంగా ఉంచింది.  ఆ తరువాత అతడితో విడిపోయి..చల్లా విజయ్ రెడ్డి అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతనితో కూడా విడిపోయింది. 


Also read: Rashmika Mandanna - Karan Johar: రష్మిక అందానికి స్టార్ ప్రొడ్యూసర్ ఫిదా.. భారీ ఆఫర్‌ ఇచ్చాడుగా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook