Rashmika Mandanna - Karan Johar: రష్మిక అందానికి స్టార్ ప్రొడ్యూసర్ ఫిదా.. భారీ ఆఫర్‌ ఇచ్చాడుగా!!

Karan Johar - Rashmika Mandanna: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ తదుపరి సినిమాలో రష్మిక మందన్న నటించనుందని సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 11:21 AM IST
  • పుష్ప సినిమా విజయవంతం
  • రష్మిక అందానికి స్టార్ ప్రొడ్యూసర్ ఫిదా
  • భారీ ఆఫర్‌ ఇచ్చాడుగా
Rashmika Mandanna - Karan Johar: రష్మిక అందానికి స్టార్ ప్రొడ్యూసర్ ఫిదా.. భారీ ఆఫర్‌ ఇచ్చాడుగా!!

Rashmika Mandanna to act in Karan Johar's Next Film: 'ఛలో' సినిమాతో రష్మిక మందన్న (Rashmika Mandanna) టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. అందం, అభినయం ఉండడం కూడా రష్మికకు కలిసొస్తోంది. వరుస హిట్స్ కొడుతూ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. గోల్డెన్ లెగ్ అనే ముద్ర ఉండడంతో దర్శకనిర్మాతలు రష్మిక డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో జతకట్టిన రష్మిక.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన పుష్పతో నేషనల్ స్టార్ అయ్యారు. 

సుకుమార్ (Sukjumar) దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప: ది రాజ్' (Pushpa) సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో భారీ వసూళ్లను రాబట్టింది. హిందీలో కూడా పెద్ద హిట్ కొట్టింది. పుష్ప సినిమా విజయవంతం కావడంతో పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్నకు క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్‌ నాయికల్లో ఒకరిగా మెరుపులు మెరిపిస్తోన్న రష్మిక.. ఇప్పుడీ జోరును ఉత్తరాదిలోనూ కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

Also Read: IND vs WI: ప్రాక్టీస్‌ లేకుండా బరిలో దిగడం కష్టం.. టీమిండియాలో అతడి రీఎంట్రీ అంత ఈజీ కాదు: భజ్జీ

కన్నడ భామ రష్మిక మందన్న బాలీవుడ్‌లో 'మిషన్‌ మజ్ను', 'గుడ్‌బై' చిత్రాలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. రష్మికకు హిందీలో మరో క్రేజీ ఆఫర్‌ దక్కినట్లు సమాచారం తెలుస్తోంది. 'పుష్ప'లో డీగ్లామర్‌ పాత్రలో శ్రీవల్లిగా నటించిన రష్మిక.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ ( Karan Johar)కు బాగా నచ్చిందట. దాంతో ఆమెకు ఓ భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా విషయమై జనవరి 24న రష్మిక ముంబైలోని కరణ్ కార్యాలయంకు వెళ్లిందట. ప్రస్తుతం కరణ్‌ నిర్మాణంలో పలు చిత్రాలు రానున్నాయి. వీటిలో ఓ సినిమా కోసం రష్మికని నాయికగా తీసుకోనున్నారని బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అయితే ఆ సినిమా ఏంటి? అందులో నటించే హీరో ఎవరు? అనేది తెలియాల్సి ఉంది. 

పుష్ప సినిమా విజయవంతం కావడంతో ఈ కన్నడ భామ తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ వన్ కోసం రష్మిక రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. పార్ట్ 2 కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ పెంచి.. మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నారట. రష్మిక ప్రస్తుతం తెలుగులో శర్వానంద్‌తో కలిసి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే 'పుష్ప 2'లోనూ నటించాల్సి ఉంది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్‌తో కూడా ఓ  సినిమా ఒప్పుకున్నారు. 

Also Read: Rajinikanth: ధనుష్, ఐశ్వర్యలను కలపడానికి సూపర్ స్టార్ ప్రయత్నాలు.. ఫోన్ చేసి మరీ..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News